Election Schedule: ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటన రేపే.. అధికారికంగా ప్రకటించిన ఈసీ

Election Schedule 2024: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదల ఎప్పుడనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. శనివారం(16 మార్చి) మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపింది. ఈసీ డేటా ప్రకారం.. అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్‌ 2వ తేదీతో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ గడువు జూన్ 16తో, ఒడిషా అసెంబ్లీ గడువు జూన్‌ 24వ తేదీతో ముగియనున్నాయి.

Election Schedule: ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటన రేపే.. అధికారికంగా ప్రకటించిన ఈసీ
Election Commission

Updated on: Mar 15, 2024 | 1:47 PM

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి మొదలైంది. ఈసీకి శుక్రవారం ఇద్దరు నూతన ఎన్నికల కమిషనర్ల నియామకం జరిగింది. ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ సమక్షంలో జ్ఞానేష్ కుమార్, డాక్టర్‌ సుఖ్ బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు. సీఈసీ రాజీవ్‌ కుమార్‌ వాళ్లకు అభినందనలు తెలియజేశారు. అనంతరం సీఈసీ అధ్యక్షతన ఈ ముగ్గురు భేటీ అయ్యారు..ఈ భేటీలోనే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనపైన క్లారిటీ ఇచ్చారు.. శనివారం (16 మార్చి)  సార్వత్రిక ఎన్నికల తేదీలు ప్రకటన చేయనుంది సీఈసీ. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు సీఈసీ ప్రెస్‌మీట్ పెట్టి లోక్‌సభ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనుంది.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ శనివారం విడుదల కానుంది..లోక్‌సభతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలను నిర్వహించేందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శనివారం విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్‌ సిద్ధమైంది.. ఇటీవల దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం టీమ్ ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించింది. మొత్తం 7 విడతల్లో లోక్‌సభ ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ పోల్స్ జరిగే అవకాశమున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ ఉన్నాయి..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..