త్వరలో నాలుగు కరోనా వ్యాక్సీన్ లు.. కేంద్ర మంత్రి హర్ష వర్ధన్

| Edited By: Pardhasaradhi Peri

May 24, 2020 | 8:30 PM

దేశంలో త్వరలో నాలుగు కరోనా వ్యాక్సీన్ లు క్లినికల్ ట్రయల్ దశకు చేరుతాయని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇందుకు పధ్నాలుగు మందిపై ప్రయోగాత్మక పరీక్షలు జరుగుతాయన్నారు

త్వరలో నాలుగు కరోనా వ్యాక్సీన్ లు.. కేంద్ర మంత్రి హర్ష వర్ధన్
Follow us on

దేశంలో త్వరలో నాలుగు కరోనా వ్యాక్సీన్ లు క్లినికల్ ట్రయల్ దశకు చేరుతాయని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఇందుకు పధ్నాలుగు మందిపై ప్రయోగాత్మక పరీక్షలు జరుగుతాయన్నారు. దేశంలో విధించిన లాక్ డౌన్ వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, అసలు ఈ లాక్ డౌన్ ని కరోనా వ్యాక్సీన్ గా చెప్పుకోవచ్చునని ఆయన అభివర్ణించారు. లాక్ డౌన్ విధించక ముందు దేశంలో కరోనా కేసుల సంఖ్య రెట్టింపు కావడానికి మూడు నాలుగు రోజులు పట్టేదని, కానీ ఈ ఆంక్షలు విధించాక అది పదమూడు రోజులకు పెరిగిందని ఆయన చెప్పారు. సరైన సమయంలో ఈ ఆంక్షలు విధించి మంచి నిర్ణయం తీసుకున్నాం. లేదా పరిస్థితి చెయ్యి దాటి ఉండేది అని ఆయన వ్యాఖ్యానించారు. చాలా ధనిక దేశాలు ఈ విషయంలో నిర్లక్ష్యం వహించాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని దేశాల్లో పరిస్థితి విషమించాక నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు.