Lockdown Extended: కేరళలో మరోసారి లాక్ డౌన్ పొడిగింపు.. ఎప్పటివరకు అంటే.?

|

May 22, 2021 | 1:59 PM

కేరళలో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్,,

Lockdown Extended: కేరళలో మరోసారి లాక్ డౌన్ పొడిగింపు.. ఎప్పటివరకు అంటే.?
Lockdown
Follow us on

కేరళలో లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి లాక్ డౌన్ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నారు. సెకండ్ వేవ్‌ని అదుపు చేసేందుకు ఈ నెల 8 నుంచి 16 వరకు లాక్ డౌన్ విధించారు. అయితే దాన్ని మళ్ళీ ఈ నెల 23 వరకు పొడిగించారు. క‌రోనా క‌ట్ట‌డికి విధించిన లాక్‌డౌన్ ను ఈనెల 30 వ‌ర‌కూ మరోసారి పొడిగిస్తున్న‌ట్టు పిన‌ర‌యి విజ‌య‌న్ ప్రకటించారు. రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన విధుల్లో చేరిన తర్వాత మొదటిసారి కరోనా పరిస్థితిపై సమీక్షించారు. ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ కూడా పాల్గొన్నారు.

తిరువ‌నంత‌పురం, ఎర్నాకుళం, త్రిసూర్ జిల్లాల్లో పాజిటివిటీ రేటు, యాక్టివ్ కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డంతో ఆయా ప్రాంతాల్లో విధించిన ట్రిపుల్ లాక్ డౌన్‌ను నేటి నుంచి ఉపసంహరించనున్నట్లు పినరయి విజయన్ తెలిపారు. అయితే, మలప్పురం జిల్లాలో ట్రిపుల్ లాక్ డౌన్ కొనసాగుతుందన్నారు. తొలిదశ కరోనాను ఎదుర్కొన్న తరహాలోనే ఇప్పుడు కూడా కరోనాను కఠినంగా, సమూలంగా పారదోలాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లాక్ డౌన్‌కు ప్రజలు సహకరించాలని కోరారు.

గత 24 గంటల్లో కేరళలో 32,762 కేసులు నమోదయ్యాయి. మొదటిసారిగా మరణాల సంఖ్య వంద దాటింది. 112 మంది కరోనా రోగులు మరణించారు. కేరళలో పాజిటివిటీ రేటు 23.31 శాతం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 6994మంది కోవిడ్‌తో చనిపోయారు. 19,79,919 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,06,346 యాక్టివ్ కోవిడ్ కేసులున్నాయి. గడిచిన 24గంటల్లో 1,33,558 మందికి టెస్టులు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!