ఎమ్మెల్యే కారులో మద్యం బాటిళ్లు..

| Edited By:

May 14, 2020 | 1:26 PM

మద్యనిషేధం అమలులో ఉన్న రాష్ట్రంలో మద్యం ప్రత్యక్షమవ్వడంతో పోలీసులు షాక్ తిన్నారు. అది కూడా ఓ ఎమ్మెల్యే కారులో.. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలో మద్య నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఓ ఎమ్మెల్యే కారులో లిక్కర్ బాటిళ్లు తీసుకువెళ్తుండగా.. పోలీసులు చేపట్టిన తనిఖీల్లో బయటపడ్డాయి. రాష్ట్రంలోని సిమ్రీ పోలీసుస్టేషన్ లిమిట్స్‌లో ఈ విషయం వెలుగుచూసింది. అయితే లిక్కర్ బాటిళ్లతో పట్టుబడ్డ ఆ కారు.. బుక్సర్ సదర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తివారీకి చెందినదిగా గుర్తించారు. […]

ఎమ్మెల్యే కారులో మద్యం బాటిళ్లు..
Follow us on

మద్యనిషేధం అమలులో ఉన్న రాష్ట్రంలో మద్యం ప్రత్యక్షమవ్వడంతో పోలీసులు షాక్ తిన్నారు. అది కూడా ఓ ఎమ్మెల్యే కారులో.. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలో మద్య నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఓ ఎమ్మెల్యే కారులో లిక్కర్ బాటిళ్లు తీసుకువెళ్తుండగా.. పోలీసులు చేపట్టిన తనిఖీల్లో బయటపడ్డాయి. రాష్ట్రంలోని సిమ్రీ పోలీసుస్టేషన్ లిమిట్స్‌లో ఈ విషయం వెలుగుచూసింది. అయితే లిక్కర్ బాటిళ్లతో పట్టుబడ్డ ఆ కారు.. బుక్సర్ సదర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తివారీకి చెందినదిగా గుర్తించారు. ఈ విషయాన్ని బుక్సర్ జిల్లా ఎస్పీ ఉపేంద్రనాథ్ శర్మ చెప్పారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే లిక్కర్ బాటిళ్లు తరలిస్తున్న కారు.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తివారీ పేరుతో రిజిస్టర్ అయిందని తెలిపారు. ఇదిలా ఉంటే.. లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో.. పేదలకు తన కారులో రేషన్ సరకులను పంపిణీ చేస్తున్నామని.. మద్యం బాటిళ్లు ఎలా వచ్చాయో తెలియదన్నారు. తన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ఎవరో కుట్ర పూరిత ప్లాన్స్ వేశారని ఎమ్మెల్యే తివారీ ఆరోపించారు.