నిర్మాణంలో ఉన్న భవనంలో చిరుతసంచారం.. ఇళ్లనుంచి ప్రజలేవరూ బయటకు రావొద్దంటూ హెచ్చరిక.. ఎక్కడంటే..

|

Jan 04, 2023 | 1:29 PM

చిరుతను పట్టుకునే వరకు ప్రజలేవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. చిరుత సంచారంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావలంటనే భయంతో వణికిపోతున్నారు.

నిర్మాణంలో ఉన్న భవనంలో చిరుతసంచారం.. ఇళ్లనుంచి ప్రజలేవరూ బయటకు రావొద్దంటూ హెచ్చరిక.. ఎక్కడంటే..
Leopard
Follow us on

పట్టణాల ఆధునీకరణ నేపథ్యంలో అడవులు పూర్తిగా అంతరించిపోయాయి. దీంతో వన్యప్రాణులు జనావాసాల్లోకి వచ్చి చేరుతున్నాయి. ఈ క్రమంలోనే గ్రేటర్ నోయిడాలోని అజ్నారా లే గార్డెన్ సొసైటీ నిర్మాణంలో ఉన్న భవనంలో మరోమారు చిరుతపులి కనిపించింది. దీంతో సొసైటీ యాజమాన్యం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించింది. గౌతమ్‌బుద్‌నగర్‌కు చెందిన మీరట్‌ అటవీ శాఖ బృందంతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

జనవరి 3 మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో సొసైటీ నిర్మాణంలో ఉన్న భవనంలో చిరుతపులి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అటవీ శాఖ బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతకోసం ముమ్మర గాలింపు చేపట్టారు. రెస్క్యూ బృందం ఘటనా స్థలానికి చేరుకున్న సమయంలోనే చిరుత లాంటి జంతువు ఒకటి వేగంగా తప్పించుకుంది. అడవి జంతువుగా నిర్ధారించిన అటవీ శాఖ బృందం దానిని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ, ఆ జంతువు చిక్కలేదు. అయితే, ఆ తర్వాత మీరట్ నుంచి చిరుత పులిని పట్టుకునే ప్రత్యేక బృందాన్ని సొసైటీకి చేరుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన సోదాలు అర్థరాత్రి వరకు కొనసాగాయి. కానీ, ఫలితం లేకుండా పోయింది. ఈ జంతువు ఫిషింగ్ క్యాట్‌లా ఉందని, చిరుతపులిగా ఉండే అవకాశం లేదని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే, సొసైటీలో చిరుత కలకలంతో సొసైటీ నిర్వాహకులు వాట్సాప్ గ్రూప్‌లో హెచ్చరిక మెసేజ్‌లు పంపించారు. చిరుతను పట్టుకునే వరకు ప్రజలేవరూ ఇళ్ల నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. చిరుత సంచారంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావలంటనే భయంతో వణికిపోతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.