6ఏళ్ల చిన్నారిని చంపిన నరమాంస భక్షక చిరుతపులి.. ఎట్టకేలకు చిక్కింది.. మృతులకు రూ.20లక్షల పరిహారం

|

Jan 03, 2023 | 12:41 PM

గతంలో గోరేగావ్‌లోని ఆరే కాలనీలో తల్లితో కలిసి గుడికి వెళ్తున్న ఏడాదిన్నర బాలికపై చిరుతపులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

6ఏళ్ల చిన్నారిని చంపిన నరమాంస భక్షక చిరుతపులి.. ఎట్టకేలకు చిక్కింది.. మృతులకు రూ.20లక్షల పరిహారం
Leopard1
Follow us on

మహారాష్ట్రలోని నాసిక్‌లో డిసెంబర్ 24న చిరుతపులి దాడిలో 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. దీంతో అటవీశాఖ చిరుతపులి కోసం విస్తృత గాలింపు చేపట్టింది. ఈ క్రమంలోనే సోమవారం చిరుతను బంధించారు అధికారులు. విషయం ఇగత్‌పురిలోని తాలేగావ్‌కి సంబంధించినది. సోమవారం ఉదయం 8 గంటలకు తలేగావ్‌లో చిరుతపులి కనిపించినట్లు సమాచారం అందిందని అటవీ శాఖ ఆర్‌ఎఫ్‌ఓ అధికారి కేతన్ బిరారీ తెలిపారు.

సమాచారం అందిన వెంటనే అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గంటల తరబడి శ్రమించి చిరుతను రక్షించారు. 6 ఏళ్ల చిన్నారిని చంపిన చిరుత ఇదేనని పలువురు భావిస్తున్నారు. అటవీ అధికారి కేతన్ బిరారీ మాట్లాడుతూ.. ‘చిరుతపులి అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. చిరుతను పట్టుకున్నామని, దానికి చికిత్స అందిస్తున్నట్టుగా చెప్పారు. డిసెంబర్‌ 24న 6ఏళ్ల బాలుడిని చిరుత పొట్టనబెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే చిరుతను బంధించినట్టుగా చెప్పారు. మృతుల కుటుంబానికి 20 లక్షల చొప్పున పరిహారం అందజేయనున్నట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి

గతంలో గోరేగావ్‌లోని ఆరే కాలనీలో తల్లితో కలిసి గుడికి వెళ్తున్న ఏడాదిన్నర బాలికపై చిరుతపులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన బాలికను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..