ఇటీవల వన్యప్రాణులు జనావాసాల్లోకి వలస పడుతున్నాయి. చాలా వరకు అడవులు అంతరించి కాంక్రీటు జంగీల్‌గా మారటంతో అడవిలో ఉండే జంతువులకు ఆహారం, నీరు, ఆవాసం కష్టంగా మారింది. దాంతో తరచూ అటవీ మృగాలు, వన్యప్రాణులు ఊళ్లు, పట్టణాల్లోకి వస్తున్నాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో అలాంటి నోరులేని జీవాలు మనుషుల చేతుల్లో ప్రాణాలు కూడా పోగొట్టుకున్న ఘటనలు వార్తల్లో వింటుంటాం.. కొన్ని సందర్భాల్లో రాత్రివేళ రోడ్డు దాటుతూ అడవి జంతువులు ప్రమాదాలకు గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని కొన్ని సార్లు వాటిని బంధించి సురక్షితంగా తిరిగి అడవుల్లో వదిలిపెడుతుంటారు అటవీశాఖ అధికారులు.. తాజాగా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. చిరుతపులి కనిపించడంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. అటవీ శాఖ బృందంపై చిరుతపులి దాడి చేస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో వివరాల్లోకి వెళితే…
హర్యానాలోని గురుగ్రామ్‌లోని నర్సింగాపూర్ గ్రామంలోకి ఓ చిరుత చొరబడింది. వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి రోడ్డు పక్కనే ఉన్న ఓ అపార్ట్‌మెంట్ మెట్లు ఎక్కింది. అది అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. మరోవైపు.. పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉన్న కొందరు అద్దంలో నుంచి వీడియో తీశారు. అది గమనించిన చిరుత వారిపై దాడి చేసేందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది. వారికి, చిరుతకు మధ్యలో అడ్డుగా అద్దం ఉండటంతో అది తిరిగి వెనక్కి వెళ్లిపోయింది.
#WATCH | Haryana: A leopard entered a house in Gurugram’s Narsinghpur village. Forest department team has arrived to catch the leopard. Gurugram Police team also reached the spot. pic.twitter.com/pSa9bQsH0w
— ANI (@ANI) January 3, 2024
బుధవారం ఉదయం గురుగ్రామ్‌లోని నర్సింగ్‌పూర్ గ్రామంలోకి ప్రవేశించింది చిరుత. దాంతో స్థానికులు వెంటనే స్థానిక పోలీసులు, అటవీశాఖకు సమాచారం అందించారు. దాంతో హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీసిబ్బంది ఎట్టకేలకు చిరుతను బంధించారు. రంగంలోకి దిగిన అటవీ బృందం.. ఉదయం 11:30, 11.45 గంటలకు రెండు డోస్‌ల ట్రాంక్విలైజర్ ఇచ్చి అదుపులోకి తెచ్చామని అటవీశాఖ అధికారులు తెలిపారు. అనంతరం చిరుతను బంధించి అక్కడి నుంఇచ తరలించారు. అయితే, చిరుత దాడిలో గ్రామానికి చెందిన యువకుడు ఒకరు గాయపడినట్టుగా తెలిసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..