
భారత్‌లో జనాభా దాదాపు 142కోట్లు.. ఓటర్లు సుమారు 97కోట్ల మంది. ఇంత పెద్దఎత్తున జనాభా, ఓటర్లు ఉన్న దేశంలో ఎన్నికలను ఎలా నిర్వహిస్తున్నారు..? రాజకీయ పార్టీలు ఎలా ప్రచారం సాగిస్తున్నాయ్..? ఎన్నికల సిబ్బంది.. పర్యవేక్షణ, భద్రతా ఇలా ఎన్నో విషయాల గురించి మనకు పెద్దగా ఆసక్తిలేని అంశాలే కావొచ్చేమో!. కానీ, ప్రపంచ దేశాలెన్నో.. భారత్‌లో జరుగుతోన్న సార్వత్రిక ఎన్నికలపై ఆసక్తి చూపిస్తున్నాయ్.. అసలు, ఎన్నికలను ఎలా నిర్వహిస్తున్నారు?. ఓటింగ్ ఎలా జరుగుతోంది?. పార్టీలు ఏవిధంగా క్యాంపెయిన్ చేసుకుంటున్నాయనే అంశాలపై విదేశాలకు చెందిన నేతలు, రాజకీయ పార్టీలు నిశితంగా గమనిస్తున్నాయ్.. అలా ఆసక్తి చూపిస్తోన్న 10 దేశాల్లోని 18 పార్టీలకు ఆహ్వానం పలికింది బీజేపీ..
బీజేపీ ఆహ్వానం మేరకు భారత్‌లో ఎన్నికలు జరుగుతోన్న తీరును తెలుసుకునేందుకు వచ్చారు 10 దేశాల నాయకులు.. వీళ్లంతా… భారత్‌లో ఎన్నికల నిర్వహణ, పార్టీల ప్రచారం గురించి తెలుసుకోనున్నారు. శ్రీలంక నుంచి రెండు పార్టీలు, నేపాల్ నుంచి ఐదు పార్టీలు, మారిషస్ నుంచి 4 పార్టీలు ఇందులో ఉన్నాయి.
సార్వత్రిక ఎన్నికలను వీక్షించేందుకు విదేశీ రాజకీయ నాయకులు భారత్ కు చేరుకున్నారు. బీజేపీ ఎన్నికల ప్రచారం, ఎన్నికల నిర్వహణ పద్ధతుల గురించి 10 దేశాల నేతలు సమగ్రంగా తెలుసుకోనున్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఈ విదేశీ రాజకీయ నాయకులందరికీ బీజేపీ ఎన్నికల ప్రచార పద్ధతుల గురించి సవివరమైన సమాచారాన్ని అందజేస్తారు. మొత్తం 10 దేశాలకు చెందిన రాజకీయ నాయకులు ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకుంటారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..