Swiggy: సాధారణంగా మనం వండుకోవటానికి బద్ధకం వల్లనో, పనిలో ఉండి కుదరకో లేదా ఇతర కారణాల వల్ల ఫుడ్ డెలివరీ యాప్ లో ఆర్డర్ చేస్తుంటాం. అందే బద్ధకం సదరు డెలివరీ బాయ్ కి వస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందామా. ఇలాంటి ఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. ఓంకార్ జోషి అనే వ్యక్తి Swiggy ద్వారా కేఫ్ కాఫీ డే(CCD) నుంచి కాఫీ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ దానిని CCD నుంచి కలెక్ట్ చేసుకున్నాడు. ఇంత వరకూ అంతా బాగానే ఉంది. కానీ.. డెలివరీ బాయ్ బద్ధకంతో తాను డెలివరీ ఇవ్వవలసిన ఆర్డర్ ను.. Dunzo డెలివరీ భాగస్వామిని బుక్ చేసుకుని సదరు కస్టమర్ వద్దకు పంపాడు. పైగా.. సదరు Swiggy ఏజెంట్ కస్టమర్ కు కాల్ చేసి తన డెలివరీకి ఫైస్టార్ రేటింగ్ ఇవ్వాలని కోరాడు.
Hello @peakbengaluru, the latest Bangalore update is broken. pic.twitter.com/GlDRJgdreh
— Omkar Joshi (@omkar__joshi) May 4, 2022
ఇలా జరగడంతో ఆశ్చర్యపోయిన సదరు కస్టమర్ ఈ విషయాన్ని తన మిత్రునితో వాట్సాప్ లో పంచుకున్నాడు. డెలివరీ చేసే వ్యక్తి సోమరితనం గురించి అందులో వివరించాడు. ఈ పీక్ బెంగళూరు బిహేవియర్ గురించి వారు చర్చించుకున్న స్కీన్ షాట్ ట్విట్టర్ లో పంచుకున్నాడు. ఆకలితో ఉన్న వ్యక్తి Swiggyలో ఆర్డర్ చేస్తే.. సదరు డెలివరీ బాయ్ దానిని కస్టమర్ వద్దకు చేర్చేందుకు Dunzo రైడ్‌ను బుక్ చేసుకున్న వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. చాలా మంది దీనిపై కామెంట్స్ చేస్తున్నారు. చాలా మంది తమకు కూడా ఇలాంటి పరిస్థితి గతంలో ఎదురైందని ట్వీట్ కు రిప్లై ఇస్తున్నారు. తన Zomato ఆర్డర్ ఒకసారి Dunzo ద్వారా డెలివరీ చేయబడిందని ఒక వినియోగదారు పేర్కొన్నాడు.
Hello @peakbengaluru, the latest Bangalore update is broken. pic.twitter.com/GlDRJgdreh
— Omkar Joshi (@omkar__joshi) May 4, 2022
ఇవీ చదవండి..
Credit Card: క్లెడిట్ కార్డ్ క్లోజ్ చేసుకుంటే ఇన్ని నష్టాలా.. ఎఫెక్ట్ ఏడేళ్లు ఉంటుందంట.. జాగ్రత్త..
Anand Mahindra: తన ఉద్యోగం ఊడుతుందంటున్న ఆనంద్ మహీంద్రా.. ఎందుకో తెలుసా..!