భూమి పూజలో మోదీతో కూర్చోబోతున్న మరో వ్యక్తి.. ఎవరో తెలుసా..?

ఆగస్టు 5వ తేదీన రామ మందిరి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరగబోతుందన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానిక ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని..

భూమి పూజలో మోదీతో కూర్చోబోతున్న మరో వ్యక్తి.. ఎవరో తెలుసా..?

Edited By:

Updated on: Jul 29, 2020 | 4:55 PM

ఆగస్టు 5వ తేదీన రామ మందిరి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం జరగబోతుందన్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానిక ముఖ్య అతిథిగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని రామజన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. ఈ కార్య్రమంలో ప్రధాని మోదీతో పాటు.. యూపీ సీఎం యోగీ ఆదిత్యానాధ్‌, ఆర్ఎస్ఎస్ కీలక నేతలు, విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌ దళ్ అగ్ర నేతలు పాల్గొననున్నారు. అంతేకాదు.. అయోధ్య కర సేవ మూమెంట్‌లో కీలక పాత్ర పోషించిన బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీలతో పాటు.. ఉమా భారతితో పాటుగా.. మరికొందరికి ట్రస్టు ఆహ్వానం పలికింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజలో పాల్గొనే సమయంలో.. మరో వ్యక్తి కూడా పాల్గొనబోతున్నట్లు ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. దీని ప్రకారం.. విశ్వ హిందూ పరిషత్‌ మాజీ చీఫ్, రామ జన్మభూమి ఉద్యమంలో ముందుండి నడిపిన నేత.. దివంగత అశోక్‌ సింఘాల్ మేనళ్లుడు కూడా నరేంద్ర మోదీతో పాటు కూర్చోబోతున్నాడట. ఆయన పేరు సలీల్ సింఘాల్‌. ఆగస్టు 5వ తేదీన సలీల్ తన భార్యతో కలిసి.. భూమి పూజలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

కాగా, “రామ మందిర భూమి పూజ సమయంలో అశోక్‌ సింఘాల్‌ గారిని స్మరించుకోవడంతో పాటు.. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇదొక మార్గం” అంటూ ట్రస్ట్ కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ పూరి అన్నారు.