
Lata Mangeshkar Letter to PM Narendra Modi’s Mother: భారత గాన కోకిల లతా మంగేష్కర్.. ప్రపంచవ్యాప్తంగా సంగీత ప్రియులను శోకసంద్రంలో ముంచి పంచభూతాల్లో కలిసిపోయారు. కానీ ఆమె మిగిల్చిన జ్ఞాపకాలు మరువలేనివి. లతా మంగేష్కర్ మాతృభాష మరాఠీ(Mahrati) అయినప్పటికీ, ఆమె తన జీవితకాలంలో అనేక భాషల్లో పాటలు పాడారు. ఆమె తొలిసారిగా గుజరాతీ(Gujarati)లో లేఖ రాసింది. అది కూడా ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్(Heera Ben)కి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ, లతా దీదీల మధ్య చాలా సాన్నిహిత్యం ఉంది. 2019 జూన్ 5న నరేంద్ర మోడీ సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి, వరుసగా రెండోసారి ప్రధానమంత్రి అయినప్పుడు మంగేష్కర్ హీరాబెన్‌కు లేఖ రాశారు. ఈ లేఖ ద్వారా ఆమె భావాలు అర్థం చేసుకోవచ్చు.
మీ పాదాలకు నా గౌరవప్రదమైన ప్రణామాలు,
శ్రీరాముడి దయతో మళ్లీ ప్రధానమంత్రి అయినందుకు మీ కుమారుడు, నా సోదరుడు నరేంద్ర భాయ్ మోడీకి అనేక అభినందనలు. మీకు, నరేంద్ర భాయ్ గారి సాదాసీదా జీవితానికి నా వందనాలు.. ప్రహ్లాద్‌భాయ్, పంకజ్‌భాయ్, మీ కుటుంబ సభ్యులందరికీ అనేకానేక శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబసభ్యులు సురక్షితమైన ఆరోగ్యం, దీర్ఘాయువు కోసం భగవంతుడిని ప్రార్థిస్తూ.. నేను మొదటిసారిగా గుజరాతీ భాషలో ఉత్తరం వ్రాస్తున్నాను తప్పులుంటే క్షమించండి
నేను నీకు నమస్కరిస్తున్నాను, తల్లీ..
— మీ కూతురు లతా మంగేష్కర్.
అంటూ ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్‌కు గాన కోకిల లతా మంగేష్కర్ ఉత్తరం రాశారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi બીજી વખત પ્રધાનમંત્રી બન્યાં તે પ્રસંગે શુભકામનાઓ પાઠવતા કોકિલ કંઠી લતા મંગેશકરજી એ હીરાબાને પ્રથમ વખત ગુજરાતી ભાષામાં પત્ર લખ્યો હતો.
પ્રધાનમંત્રીશ્રીને લતા મંગેશકરજી પોતાના ભાઈ માનતા હતા. અત્યંત મૃદુભાષી લતાજીની ખોટ પૂરી શકાય તેમ નથી. pic.twitter.com/d1OGqEuD2W
— BJP Gujarat (@BJP4Gujarat) February 6, 2022
ఇదిలావుంటే. కోవిడ్ -19 సహా ఇతర అనారోగ్యాల కారణంగా 29 రోజుల పాటు ఆసుపత్రిలో చేరిన తర్వాత, మంగేష్కర్ ఆదివారం 92 ఏళ్ల వయస్సులో ఆమె తుది శ్వాస విడిచిన తర్వాత గుజరాత్ రాష్ట్ర బీజేపీ శాఖ ఈ లేఖను పంచుకుంది. లతా మంగేష్కర్ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా ముంబై నగరంలోని ఆసుపత్రిలో ఉదయం మరణించారు. సాయంత్రం సెంట్రల్ ముంబైలోని శివాజీ పార్క్‌లో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. లతా దీదీకి అంతిమ నివాళులు అర్పించేందుకు ప్రధాని ముంబైకి వెళ్లారు. కాగా, ఆమె భౌతికకాయాన్ని దహన సంస్కారాల నిమిత్తం దాదర్ ప్రాంతంలోని శివాజీ పార్క్ గ్రౌండ్‌కు తీసుకువచ్చిన సందర్భంగా ప్రధాని మోడీ ఆమె భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులు అర్పించి, మంగేష్కర్ కుటుంబ సభ్యులను ఓదార్చిన అనంతరం ప్రధాని అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Read Also…