Snake: ఇప్పటివరకు బయటపడ్డ పలు ముఖాల నాగ శిల్పాలు.. ఇప్పుడు ఏకంగా సజీవ పాము..

కర్ణాటక రాష్ట్రం గడగ్ జిల్లా లక్కుండిలో కొనసాగుతున్న తవ్వకాల్లో ప్రతిరోజూ కొత్త పురాతన అవశేషాలు వెలుగుచూస్తున్నాయి. నాగ శిల్పాలు లభిస్తున్న అదే ప్రదేశంలో సజీవ పాము కనిపించడం స్థానికుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. చాళుక్యుల కాలానికి చెందిన మరిన్ని చారిత్రక ఆనవాళ్లు బయటపడతాయనే అంచనాలతో పురావస్తు శాఖ తవ్వకాలు కొనసాగిస్తోంది. పూర్తి వివరాలు కథనం లోపల...

Snake: ఇప్పటివరకు బయటపడ్డ పలు ముఖాల నాగ శిల్పాలు.. ఇప్పుడు ఏకంగా సజీవ పాము..
Lakkundi Excavation

Updated on: Jan 31, 2026 | 6:33 PM

కర్నాటక గడగ్ జిల్లా లక్కుండిలో జరుగుతున్న తవ్వకాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దాదాపు ప్రతిరోజూ కొత్త పురాతన అవశేషాలు బయటపడుతున్నాయి. శుక్రవారం 13వ రోజు తవ్వకం పనులు ప్రారంభించక ముందే ఆ ప్రదేశంలో.. ఓ గుంత వద్ద సజీవ పాము కనిపించింది. ఇది స్థానికులు, సందర్శకులలో చర్చకు దారితీసింది.

ఇప్పటివరకు లక్కుండి తవ్వకాలలో అనేక నాగ శిలలు బయటపడ్డాయి. వాటిలో ఏకముఖ, రెండు ముఖాలు, మూడు ముఖాలు, ఐదు ముఖాలు. ఏడు ముఖాలు కలిగిన సర్ప శిల్పాలు ఉన్నాయి. అయితే శుక్రవారం తెల్లవారుజామున, తవ్వకం స్థలంలో ఒక గొయ్యి లోపల రెండున్నర అడుగుల పొడవున్న సజీవ పాము కనిపించింది. శరీరంపై నల్లటి మచ్చలు ఉన్న ఆ పాము విషపూరితమైన బేల్ ఓడకా జాతికి చెందినదిగా అనుమానిస్తున్నట్లు స్థానిక వర్గాలు తెలిపాయి. పామును గమనించిన తర్వాత.. తవ్వకం సిబ్బంది, పర్యవేక్షకులు జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ చేసి దానిని సురక్షితంగా రక్షించారు. సర్ప శిల్పాలు దొరికిన సమయంలో నిజమైన పాము కనిపించడం స్థానికుల్లో ఉత్సుకతను పెంచింది.

లక్కుండిలో తవ్వకాలు ఎందుకు..?

అక్కడ భూమి కింద పాత ఆలయాలు, శిల్పాలు, నాగరాళ్లు ఉన్నాయని అనుమానం ఉంది. లక్కుండి చాళుక్యుల కాలంలో చాలా ముఖ్యమైన ప్రాంతం.గ్రామస్తుల దగ్గర నుంచి వచ్చిన సమాచారం.. పాత ఆధారాలు చూసి.. గతంలో బయటపడ్డ సాంస్కృతి సంపద ఆనవాళ్ల కారణంగా.. ఇక్కడ ఇంకా చరిత్ర దాగి ఉందని పురావస్తు శాఖ గుర్తించింది. అందు కేదాగి ఉన్న పురాతన అవశేషాలు బయటకు తీయడానికి, లక్కుండి అసలు చరిత్ర ఏమిటో తెలుసుకోవడానికి పురావస్తు శాఖ తవ్వకాలు చేపడుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.