Vaishno Devi Temple: వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం..తుపాకీ పట్టుకుని నేరుగా గుళ్లోకి వెళ్లిన మహిళ..! ఏం జరిగిందంటే..

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. మార్చి 15న ఓ మహిళ తన వద్ద పిస్టోల్‌తో వైష్ణోదేవి ఆలయంలోకి వెళ్లింది. ఈ విషయాన్ని ఆలయ అధికారులు గమనించారు.. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మహిళ వద్ద కనిపించిన పిస్టోల్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ఆలయ భద్రతా విభాగంపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. భక్తులు భద్రతా చర్యల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ,

Vaishno Devi Temple: వైష్ణోదేవి ఆలయంలో భద్రతా వైఫల్యం..తుపాకీ పట్టుకుని నేరుగా గుళ్లోకి వెళ్లిన మహిళ..! ఏం జరిగిందంటే..
Vaishno Devi Temple

Updated on: Mar 18, 2025 | 7:01 PM

జమ్మూలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశం శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయంలో సిబ్బంది భద్రతా వైఫల్యం బయటపడింది. ఒక మహిళ భద్రతా తనిఖీలను తప్పించుకుని, పిస్తోల్‌ ఆలయంలోకి ప్రవేశించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. మార్చి 15న ఓ మహిళ తన వద్ద పిస్టోల్‌తో వైష్ణోదేవి ఆలయంలోకి వెళ్లింది. ఈ విషయాన్ని ఆలయ అధికారులు గమనించారు.. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మహిళ వద్ద కనిపించిన పిస్టోల్‌ స్వాధీనం చేసుకున్నారు.

మహిళ వద్ద లభించిన పిస్టోల్‌ లైసెన్స్‌ గడువు ముగిసినట్టుగా అధికారులు గుర్తించారు. ఇలా లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత కూడా ఆమె దాన్ని ఉపయోగిస్తూ.. ఆలయంలోకి తీసుకురావడం పట్ల సదరు మహిళపై పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా వెల్లడించారు. విచారణలో ఆమె ఢిల్లీలో పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న జ్యోతి గుప్తాగా గుర్తించారు.

ఈ ఘటన ఆలయ భద్రతా విభాగంపై అనేక ప్రశ్నలు లేవనెత్తింది. భక్తులు భద్రతా చర్యల పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, మహిళ ఆలయం లోపలికి ప్రవేశించే వరకు భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం పట్ల తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..