భర్తను చంపి కడుపు చీల్చి పేగులు సంచిలో వేసి..! ఇంటి ఓనర్ చూడగానే..

హర్యానాలోని కురుక్షేత్రలో దారుణ ఘటన కలకలం రేపింది. భార్య విమలా దేవి తన భర్త రాజేష్‌ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంటి యజమాని అక్కడికి చేరుకునే సరికి రాజేష్‌ తీవ్ర గాయాలతో కనిపించాడు. అనంతరం విమలా టెర్రస్‌ నుంచి కిందకు దూకి గాయపడింది.

భర్తను చంపి కడుపు చీల్చి పేగులు సంచిలో వేసి..! ఇంటి ఓనర్ చూడగానే..
Kurukshetra Case

Updated on: Aug 24, 2026 | 7:08 AM

హర్యానాలోని కురుక్షేత్రలో సంచలనం రేపిన దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ తన భర్తను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాలతో భర్త రక్తపు మడుగులో పడి ఉండగా, నిందితురాలు టెర్రస్‌పై నుంచి కిందకు దూకినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇంట్లోనే దారుణ ఘటన

పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌ జిల్లా ధాంపూర్‌ గ్రామానికి చెందిన రాజేష్‌ తన భార్య విమలా దేవితో కలిసి సుమారు ఏడాదిగా కురుక్షేత్రలో నివసిస్తున్నాడు. పెహోవా రోడ్డులోని రాజ్‌ ప్యాలెస్‌ సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు. రాజేష్‌ అదే ప్రాంతంలోని ఓ నీటి సరఫరా సంస్థలో పనిచేస్తున్నాడు. ఘటన జరిగిన రోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు ఇంటి యజమాని రింకు తెలిపాడు. వారి అరుపులు వినిపించడంతో అతను వెంటనే ఇంటి పైకప్పుపైకి వెళ్లాడు.

రక్తపు మడుగులో భర్త

అక్కడికి వెళ్లిన ఇంటి యజమానికి షాకింగ్‌ దృశ్యం కనిపించినట్లు పోలీసులు తెలిపారు. రాజేష్‌ కడుపు ప్రాంతంలో తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని కడుపులోని పేగులు తీసి విమలా ఓ సంచిలో ఉంచుతున్నట్లు ఇంటి యజమాని పోలీసులకు తెలిపాడు. తనను చూసిన వెంటనే విమలా భయంతో టెర్రస్‌ నుంచి కిందకు దూకినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మూడు కత్తులు స్వాధీనం

సమాచారం అందుకున్న వెంటనే స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ సురీందర్‌ సింగ్‌ ఆధ్వర్యంలోని పోలీసు బృందం ఘటనాస్థలికి చేరుకుంది. ఫోరెన్సిక్‌ నిపుణులతో కలిసి ఆధారాలను సేకరించింది. నేరస్థలంలో వేర్వేరు పరిమాణాల్లో ఉన్న మూడు కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదికలో రాజేష్‌ పొట్ట ప్రాంతంలో తీవ్ర గాయాలు ఉన్నట్లు వెల్లడైనట్లు సమాచారం. శరీరంలోని కొన్ని అవయవాలు కనిపించకపోవడంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి యజమాని వాంగ్మూలం ప్రకారం, విమలా సంప్రదాయ వైద్యం, భూతవైద్యానికి సంబంధించిన కొన్ని పద్ధతుల్లో పాల్గొనేదని తెలుస్తోంది. దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని కూడా ఆయన పేర్కొన్నాడు. అయితే హత్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. రాజేష్‌, విమల దంపతులకు చాలా సంవత్సరాల క్రితమే వివాహం జరిగినప్పటికీ పిల్లలు లేరని పోలీసులు తెలిపారు. భార్య వాంగ్మూలం, ఫోరెన్సిక్‌ ఆధారాలు, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. మహిళ కోలుకున్న తర్వాత ఆమె నుంచి పూర్తి వివరాలు సేకరించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us