Maha Kumbh 2025: రికార్డులే రికార్డులు.. కుంభమేళాకు చివరి రోజున ఎంత మంది వచ్చారో తెలుసా..?

|

Feb 26, 2025 | 6:54 PM

144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళా మహాఘట్టం నేటితో (ఫిబ్రవరి 26) ముగిసింది. జనవరి 13న మొదలైన ఈ మహా కుంభమేళా.. మహా శివరాత్రి పర్వదినంతో ముగిసింది.. చివరి రోజున భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మహాకుంభమేళాలో మహాశివరాత్రి రోజున 2.5 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు..

Maha Kumbh 2025: రికార్డులే రికార్డులు.. కుంభమేళాకు చివరి రోజున ఎంత మంది వచ్చారో తెలుసా..?
Maha Kumbh 2025
Follow us on

144 ఏళ్లకోసారి వచ్చే మహాకుంభమేళా మహాఘట్టం నేటితో (ఫిబ్రవరి 26) ముగిసింది. జనవరి 13న మొదలైన ఈ మహా కుంభమేళా.. మహా శివరాత్రి పర్వదినంతో ముగిసింది.. చివరి రోజున భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. మహాకుంభమేళాలో మహాశివరాత్రి రోజున 2.5 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు.. ప్రయాగ్‌రాజ్‌లోని సంగం ఒడ్డున 45 రోజుల పాటు జరిగిన మహాకుంభమేళాలో ఇప్పటివరకు 65 కోట్ల మందికిపైగా పుణ్యస్నానాలు చేసినట్టు యూపీ ప్రభుత్వం వెల్లడించింది.. చివరి రోజున గణాంకాలు చూసుకుంటే.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది..

కాగా.. ఏడు శైవ అఖారాలకు, మహాకుంభ్-2025 బుధవారం నాడు గొప్ప పేష్వై ఊరేగింపుల తర్వాత కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలతో మహాశివరాత్రి నాడు ముగిసింది. పేష్వై ఊరేగింపులో భాగంగా, 10,000 మందికి పైగా నాగ సాధువులు, పండుగ ఉత్సాహాన్ని పెంచుతూ, కాశీ రోడ్ల గుండా తమ దేవతలు, జెండాలతో, త్రిశూలాలు, కత్తులు, గదలను ప్రదర్శిస్తూ ‘హర్ హర్ మహాదేవ్’ నినాదాల మధ్య పాడుతూ, నృత్యం చేస్తూ ప్రదర్శన చేశారు.

శివరాత్రి రోజున పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పోటేత్తారు. చివరిరోజున కుంభమేళాలో భక్తులపై హెలికాఫ్టర్‌తో పూలవర్షం కురిపించారు.. ఆధ్యాత్మిక యాత్రకు వచ్చే వారిలో మరింత భక్తిభావం పెంచేలా ఇలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కుంభమేళాలో భాగంగా మహా శివరాత్రి రోజు చివరి అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

కాగా.. శివరాత్రి రోజున 12 జ్యోతిర్లింగాలలో అత్యంత పూజనీయమైన కాశీ విశ్వనాథుని ఆలయానికి భక్తులు పోటేత్తారు.. లక్షలాది మంది తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. మహాశివరాత్రి వేడుకల్లో సుమారు 25 లక్షల మంది భక్తులు పాల్గొనడంతో గత రికార్డులన్నింటినీ బద్దలైనట్లు అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..