Kolkata: కోల్‌కతాలో డాక్టర్‌ అత్యాచారం, హత్య ఘటన.. నిరవధిక సమ్మె విరమించిన ఫైమా

|

Aug 22, 2024 | 6:53 PM

కోల్‌కతా డాక్టర్‌ హత్యచార ఘటనలో సుప్రీం కోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో వైద్య సంఘాలు కాస్త శాంతించాయి. గత కొన్ని రోజులుగా చేపడుతున్న నిరవధిక సమ్మెను విరమించాలని ఫైమా డాక్టర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు ఫైమా ప్రతినిధులు సమాలోచనల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ల

Kolkata: కోల్‌కతాలో డాక్టర్‌ అత్యాచారం, హత్య ఘటన.. నిరవధిక సమ్మె విరమించిన ఫైమా
Kolkata Rape Case[1]
Follow us on

కోల్‌కతా డాక్టర్‌ హత్యచార ఘటనలో సుప్రీం కోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో వైద్య సంఘాలు కాస్త శాంతించాయి. గత కొన్ని రోజులుగా చేపడుతున్న నిరవధిక సమ్మెను విరమించాలని ఫైమా డాక్టర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు ఫైమా ప్రతినిధులు సమాలోచనల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ల రక్షణ కోసం తాము ఉంచిన డిమాండ్ల విషయంలో సర్వోన్నత న్యాయస్థానం సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తమ న్యాయపోరాటం కొనసాగుతుందని సోషల్‌ మీడియా వేధిక వెల్లడించారు.

 

కాగా, ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రిలో మహిళా డాక్టర్‌పై ఈ దారుణంగా చోటు చేసుకుంది. అత్యాచారం చేసిన తర్వాత ఆమెను హత్య చేశారు. హృదయ విదారకమైన ఈ ఘటనకు వ్యతిరేకంగా 11 రోజులుగా వైద్య సంఘాల నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిరసన తెలుపుతున్న వైద్యులను సాధారణ విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సమ్మెను విరమిస్తూ రెసిడెంట్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ మాట్లాడుతూ సుప్రీంకోర్టులో అప్పీల్‌, హామీ మేరకు తిరిగి విధుల్లో చేరుతున్నామని తెలిపారు. కోర్టు ఆదేశాలను అంగీకరిస్తున్నామని అన్నారు. పేషెంట్ కేర్ మా మొదటి ప్రాధాన్యత అని అన్నారు. ఇదిలా ఉండగా, కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ వైద్యులు సమ్మె , ర్యాలీలు నిర్వహిస్తున్నారు. భారతదేశంలో వైద్యుల భద్రతను పర్యవేక్షించడానికి 10 మంది సభ్యులతో కూడిన నేషనల్ టాస్క్ ఫోర్స్ (NTF)ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి