ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో క్రైమ్ సీన్ తారుమారు అయ్యిందా..? కోల్‌కతా పోలీసులు ఏమంటున్నారు..?

|

Aug 30, 2024 | 9:21 PM

ఒక వైపు నిరసన ప్రదర్శనలు, మరో వైపు లేఖాస్త్రాలు, యంగ్ డాక్టర్‌ అత్యాచారం, హత్య ఘటనపై బెంగాల్‌ అట్టుడుకుతూనే ఉంది. ఈ కేసు వెలుగులోకి వచ్చి 20 రోజులు దాటుతున్నా ఒక పటిష్ఠమైన ఆధారం కూడా ఇంత వరకు బయటకు రాలేదు.

ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో క్రైమ్ సీన్ తారుమారు అయ్యిందా..? కోల్‌కతా పోలీసులు ఏమంటున్నారు..?
Kolkata Doctor Murder Case
Follow us on

ఒక వైపు నిరసన ప్రదర్శనలు, మరో వైపు లేఖాస్త్రాలు, యంగ్ డాక్టర్‌ అత్యాచారం, హత్య ఘటనపై బెంగాల్‌ అట్టుడుకుతూనే ఉంది. ఈ కేసు వెలుగులోకి వచ్చి 20 రోజులు దాటుతున్నా ఒక పటిష్ఠమైన ఆధారం కూడా ఇంత వరకు బయటకు రాలేదు.

నిరసనలతో కోల్‌కతా నగరం అట్టుడుకుతూనే ఉంది. మమతా బెనర్జీ సర్కార్‌ను విమర్శిస్తున్న బీజేపీ -కోల్‌కతాలో నిత్యం నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూనే ఉంది. కోల్‌కతా నగరంలోని ప్రధాన వీధుల గుండా బీజేపీ మహిళా నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తాజాగా కోల్‌కతాలోని బెంగాల్‌ మహిళా కమిషన్‌ కార్యాలయాన్ని బీజేపీ మహిళా మోర్చా ముట్టడించింది. మహిళా కమిషన్‌ కార్యాలయానికి బీజేపీ మహిళా నాయకులు తాళం వేశారు. బెంగాల్‌లో మహిళా కమిషన్‌ ఉన్నా అది మహిళలకు ఉపయోగపడదని ప్రకటించారు. మహిళా కమిషన్‌ చచ్చిపోయిందని, మూడు రోజుల తర్వాత వచ్చి తాము అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని బీజేపీ నేతలు ప్రకటించారు.

మరో వైపు అత్యాచార ఘటనలపై కఠినమైన చట్టాలు తేవాలని కోరుతూ ప్రధాని మోదీకి బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ మరో లేఖ రాశారు. సున్నితమైన ఈ విషయంలో తాను ఆగస్టు 22న రాసిన లేఖకు ప్రధాని నుంచి ఎటువంటి సమాధానం రాలేదని, రెండో లేఖలో ఆమె ప్రస్తావించారు. అదే సమయంలో తనకు మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి నుంచి లేఖ అందిందని మమత పేర్కొన్నారు. కాని, తాను ప్రస్తావించిన విషయాలకు ఆ లేఖలో ఎటువంటి సమాధానం దొరకలేదని స్పష్టం చేశారు. ఏదో మొక్కుబడిగా సమాధానం రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అటు సీబీఐ దర్యాప్తు చేపట్టి రెండు వారాలు దాటుతున్నా కేసులో ఎటువంటి పురోగతి కనిపించడం లేదని ఇప్పటికే మమతా బెనర్జీ ఆరోపించారు. అటు కోల్‌కతా పోలీసులు తాజాగా వెలుగు చూసిన ఆడియో టేపులపై స్పందించారు. తాము ఏనాడు డాక్టర్‌ది ఆత్మహత్య అని చెప్పలేదని, ఆ విషయాన్ని ఆడియో టేపు సంభాషణలు స్పష్టం చేస్తున్నాయమని అంటున్నారు. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగిన ఆర్‌జి కార్ హాస్పిటల్‌లోని సెమినార్ హాల్‌లో ట్యాంపరింగ్ జరిగిందని సిబిఐ ఆరోపించిన తర్వాత కోల్‌కతా పోలీసుల ప్రకటన వచ్చింది.

మరో వైపు RG కర్‌ హాస్పిటల్‌కు చెందిన నలుగురు జూనియర్‌ డాక్టర్లను సీబీఐ ప్రశ్నించింది. ఈ నలుగురు డాక్టర్లు ఆ రోజు బాధితురాలితోపాటు డ్యూటీలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు దర్యాప్తు తీరును సదరు డాక్టర్‌ తల్లి తప్పుబడుతున్నారు. కేసుకు సంబంధించిన పత్రాలు తారుమారు చేశారని ఆరోపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..