Watch: కేబుల్స్ తెగలేదు.. హెలికాప్టర్‌ను కావాలనే పడేశారట..! అసలేం జరిగిందంటే.. షాకింగ్ వీడియో..
ఆర్మీ చాపర్ ద్వారా.. హెలికాప్టర్‌ను మరమ్మతుల కోసం తరలిస్తుండగా.. అది పై నుంచి కుప్పకూలింది.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..కేదార్‌నాథ్‌లో ఇటీవల ఒక క్రెస్టల్ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో దెబ్బతిన్నది.. దీనిని తరలించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. వాయుసేనకు చెందిన ఎంఐ-17 చాపర్ ద్వారా .. ప్రత్యేకమైన కేబుల్స్ సహాయంతో క్రెస్టల్ హెలికాప్టర్‌ను కట్టి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఆర్మీ చాపర్ ద్వారా.. హెలికాప్టర్‌ను మరమ్మతుల కోసం తరలిస్తుండగా.. అది పై నుంచి కుప్పకూలింది.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..కేదార్‌నాథ్‌లో ఇటీవల ఒక క్రెస్టల్ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో దెబ్బతిన్నది.. దీనిని తరలించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. వాయుసేనకు చెందిన ఎంఐ-17 చాపర్ ద్వారా .. ప్రత్యేకమైన కేబుల్స్ సహాయంతో క్రెస్టల్ హెలికాప్టర్‌ను కట్టి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే.. కొద్ది దూరం ప్రయాణించిన వెంటనే కేదార్‌నాథ్-గచౌర్ మధ్య భీంబాలి ప్రాంతంలో ఎంఐ-17 హెలికాప్టర్‌కు అమర్చిన తీగలు తెగిపోయాయి.. దీంతో కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి క్రెస్టల్ హెలికాప్టర్ కొండపై పడి.. పూర్తి ధ్వంసమైంది.. అయితే.. కేబుల్స్ తెగలేదని .. కావాలనే జారవిడిచినట్లు అధికారులు తెలిపారు.
కావాలనే..
అయితే.. చాపర్ కు కట్టిన తాడు తెగలేదని.. కావాలనే పైనుంచి వదిలేసినట్లు అధికారులు తెలిపారు. ఎయిర్‌ఫోర్స్ Mi-17 హెలికాప్టర్‌ను నడుపుతున్న పైలట్.. కొన్ని వేల అడుగుల పైన తీవ్ర గాలి మధ్యలో కుదుపులు సంభవించి.. బ్యాలెన్స్ తప్పినట్లు తెలిపారు. ముందే అపాయాన్ని గమనించి.. దెబ్బతిన్న హెలికాప్టర్‌ను బలవంతంగా జారవిడిచినట్లు అధికారులు తెలిపారు. అపాయన్ని గ్రహించిన పైలట్ హెలికాప్టర్‌ను విడిచిపెట్టడంతో.. హెలికాప్టర్ కిందపడినట్లు అధికారులు తెలిపారు. పైలట్ వేగవంతమైన చర్య తీసుకోవడంతో ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
వీడియో చూడండి..
కూలిన హెలికాప్టర్ క్రిస్టల్ ఏవియేషన్ కంపెనీకి చెందినది. అపాయాన్ని ముందే పసిగట్టిన పైలట్ త్వరగా ఖాళీ స్థలం కోసం స్కాన్ చేసి హెలికాప్టర్‌ను కొండపై జారవిడిచినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. మరమ్మతు కోసం తీసుకువెళుతున్న హెలికాప్టర్ సాంకేతిక సమస్యల కారణంగా మే 24, 2024న అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీని తరువాత, విమానాన్ని మరమ్మతుల కోసం గౌచర్ ఎయిర్‌స్ట్రిప్‌కు రవాణా చేస్తున్నారు.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ Mi-17 హెలికాప్టర్ ద్వారా తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అంచనా వేస్తోంది.హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణనష్టం జరిగినట్లు పుకార్లు వ్యాప్తి చేయవద్దని రెస్క్యూ టీమ్ ప్రతినిధి సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




