Kohinoor Diamond: పూరి జగన్నాథుడిదే కోహినూర్ వజ్రం.. తిరిగి తెప్పించాలని రాష్ట్రపతికి వినతి..

|

Sep 13, 2022 | 2:08 PM

Lord Jagannath: భారతదేశానికి తిరిగి ఇవ్వాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా ఈ వజ్రం గురించిన మరో వాదన తెరమీదికి వచ్చింది. ఒడిశాలోని శ్రీ జగన్నాథ సేన అనే సంస్థ ఈ విలువైన వజ్రం

Kohinoor Diamond: పూరి జగన్నాథుడిదే కోహినూర్ వజ్రం.. తిరిగి తెప్పించాలని రాష్ట్రపతికి వినతి..
Kohinoor Diamond Belonged T
Follow us on

Kohinoor Diamond: కోహినూర్ వజ్రాన్ని భారతదేశానికి తిరిగి ఇవ్వాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా ఈ వజ్రం గురించిన మరో వాదన తెరమీదికి వచ్చింది. ఒడిశాలోని శ్రీ జగన్నాథ సేన అనే సంస్థ ఈ విలువైన వజ్రం జగన్నాథునిదేనని.. ఆ వజ్రాన్ని తెప్పించాలంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. పూరీకి చెందిన శ్రీ జగన్నాథ్ సేన అనే సంస్థ రాష్ట్రపతికి మెమోరాండం సమర్పించింది. 12వ శతాబ్దపు ఆలయంలోని వజ్రాన్ని తిరిగి తీసుకువచ్చే ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని అన్నారు. ఇంతకాలం బ్రిటన్ రాణి కిరీటానికే మకుటాయమానంగా కనిపించేది.. కోహినూర్ వజ్రమే.. ఈ అమూల్యమైన వజ్రం మనదే.. అయితే బ్రిటన్ రాణి కనుమూయడంతో ఇప్పుడీ వజ్రం.. ఆమె కోడలు కెమిల్లాకు దక్కుతుందని ప్రచారం సాగుతోంది.

చార్లెస్ పట్టాభిషేక సమయంలో ఈ కిరీటాన్ని ధరించనున్నారు కెమిల్లా. కిరీటంలో మొత్తం 2800 వజ్రాలున్నా.. కోహినూర్ ఉండటం వల్లే ఈ క్వీన్స్ క్రౌన్ అందం రెట్టింపయ్యింది. ఇదొక మాస్టర్ పీస్ గా పేరు సాధించింది. కోహినూర్ పుట్టిన ప్రాంతం- కాలం- చరిత్ర ఎన్నో రకాలుగా వినిపిస్తుంటాయి.. కోహినూర్ వజ్రం దొరికింది కృష్ణాతీరంలోని కొల్లూరులో అన్నది చరిత్రకారుల మాట. 1849లో లాహోర్ ఒప్పందంలో భాగంగా ఈ వజ్రాన్ని తీసుకుని.. లాహోర్ మహారాజు దిలీప్ సింగ్ బ్రిటీష్ వారికి అప్పగించారనీ.. అప్పటి నుంచీ బ్రిటన్ రాజాభరణాల్లోనే ఒక కలికి తురాయిగా ఇది తులతూగుతోందని చెబుతోంది రాయల్ జ్యువెల్ హిస్టరీ.

కోహినూర్ అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మనదే.. గతంలో ఎన్నో విలువైన వస్తువులు భారత దేశం దాటినా.. తిరిగి మన చెంతకు చేరిన దాఖలాలున్నాయ్. అలాంటి వాటి కోవలోకి కోహినూర్ ను కూడా చేర్చాలన్నది.. భారతీయుల చిరకాల వాంఛ. అయితే ఈ ప్రయత్నాలు అంత తేలిగ్గా సాధ్యపడేలా కనిపించడం లేదు.. అయినా సరే అది కోహినూర్ వజ్రం కావడం వల్ల.. ఈ కాంతి పర్వతం విలువ అంకెల్లో వర్ణించడం వీలు కానిదవడం వల్ల.. ఎప్పటికైనా ఈ వజ్రాన్ని తిరిగి భారత్ బాట పట్టించాలన్న ఉద్దేశంతో ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు జరిగ్గా.. తాజాగా బ్రిటన్ రాణి మరణంతో.. మరోమారు కోహినూర్ ట్వీట్లు వెల్లువెత్తుతున్నాయి..

ఇది ఇప్పటి ప్రయత్నం కాదు.. 1947 నుంచే కోహినూర్ ను భారత్ కు తెప్పించాలని ప్రయత్నం చేస్తోంది భారత ప్రభుత్వం. 1953లో బ్రిటన్ రాణిగా పట్టాభిషిక్తురాలైన ఎలిజబెత్-2కు విన్నపం చేసింది భారత్. అప్పట్లో కోహినూర్ ను భారత్ కు తెప్పించాలంటూ రాజ్యసభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టి 50 మంది ఎంపీలు సంతకాలు చేశారంటే తెలుసుకోవచ్చు ఈ వజ్రం విలువ ఏపాటిదో. 2009లో దీన్ని తిరిగి ఇండియాకు తెప్పించాలని డిమాండ్‌ చేశారు మహాత్మా గాంధీ మనవడు తుషార్‌ గాంధీ. 2013లో కోహినూర్ తిరిగి ఇవ్వాలని భారత్ చేస్తున్న డిమాండ్ ను తోసిపుచ్చారు నాటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్. ఇలా కోహినూర్ ని తిరిగి తెప్పించడం కోసం భారత్ చేసిన ప్రయత్నాలు చాలానే.. ఉన్నాయి.

ఇవన్నీ ఇలా ఉంటే.. కోహినూర్ మాదేనంటున్నాయ్ పాకిస్తాన్, ఇరాన్, అప్గానిస్తాన్ వంటి దేశాలు. 1976లో బ్రిటన్‌ ప్రధానికి లేఖ రాశారు.. పాక్‌ ప్రధాని భుట్టో. 2000 సంవత్సరంలో కోహినూర్ మాదేనంటు డిమాండ్ చేశారు తాలిబన్లు. అదీ ఈ డైమండ్ డిమాండ్. అలాంటి వజ్రం.. ప్రస్తుతం బ్రిటన్ రాణి కిరీటానికే వజ్రాభరణమై తులతూగుతోంది.

కోహినూర్ పై అపోహలు.. కూడా చాలానే ఉన్నాయి.. ఈ వజ్రాన్ని మహిళలు మాత్రమే ధరించాలన్న వాదనొకటి నడుస్తోంది. అలాకాకుంటే దేవుడి ఆభరణాల్లో మాత్రమే ఈ వజ్రాన్ని పొదగాలన్న విశ్వాసాలు ఉన్నాయ్. ఇక పురుషులు కోహినూర్ ను ధరిస్తే రక్తపాతం సంభవిస్తుందని అంటారు.

21. 12 గ్రాముల బరువు తూగే- కోహినూర్ వజ్రం 105. 602 కేరట్లలో ఉంటుంది. 66 ముఖాలుండే.. ఈ డైమండ్ 3.6 సెం.మీ పొడవు, 3.2 సెం.మీ వెడల్పు, 1.3 సెం.మీ లోతుగా కన్పిస్తుంది. కోహినూర్ వజ్రం పుట్టిల్లు ఎక్కడంటే.. ఈ వజ్రం తెలుగు గడ్డపైనే దొరికిందని చరిత్ర. ఏపీలోని కృష్ణా తీరంలో కోల్లూరు ప్రాంతంలో ఈ వజ్రం లభ్యమైందని ఇప్పటికే స్పష్టం చేశారు చరిత్రకారులు.

1980లో ‘ది కోహినూర్ డైమండ్ – ది హిస్టరీ అండ్ ది లెజెండ్’ పుస్తకంలో కోహినూర్ వజ్రం.. కోల్లూరులో దొరికిందని రాశారు స్టీపెన్ హోవర్త్. కోహినూర్ వజ్రం- కోల్లూరు గనుల్లో దొరికిందని తేల్చి చెప్పింది.. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక. నల్లమల కొండల అంచుల్లో ఉన్న- కోల్లూరు అప్పట్లో భారత ఉపఖండంలో అతి పెద్ద గనులకు ప్రసిద్ది పొందిన ప్రాంతం. అప్పట్లో ఇది గోల్కొండ రాజ్యంలో ఉండేది. ఇందుకు సంబంధించి.. కుతుబ్‌ షాహీలకాలంలో నిర్మించిన వాచ్ టవర్ ఇప్పటికీ ఉంది.

1630 ప్రాంతాల్లో కోల్లూరులో ఓ మహిళకు ఈ వజ్రం దొరికినట్లు చెబుతారు చరిత్రకారులు. వజ్రం మొదట కాకతీయులకు లభించిందని వారి నుంచి ఢిల్లీ చక్రవర్తులకు, అక్కడి నుంచి మాల్వా రాజులకు, అక్కడి నుంచి తిరిగి ఢిల్లీ రాజులకు, అటు నుంచి మళ్లీ గోల్కొండ రాజులకు చేరిందన్న వాదనలు ప్రచారంలో ఉన్నాయి. తిరిగి మొఘలుల దగ్గరకే కోహినూర్‌ వజ్రం చేరిందని అంటారు. ఆ తర్వాత కోహినూర్ బ్రిటీష్ వారు తీసుకున్నారన్నది మరో వాదన. 13వ శతాబ్దానికే కోల్లూరు గనులు ప్రాచుర్యంలో ఉన్నాయి. అప్పటి నుంచి కుతుబ్ షాహీల పాలన 17వ శతాబ్దం వరకూ ఇక్కడ గనుల్లో వజ్రాలు వెలికి తీశారు. అయితే, బ్రిటిష్ హయాంలో వజ్రాల తవ్వకాలు జరిగినట్లు ఆధారాలు లేవు.

కోహినూర్ ఇంగ్లండ్ కు ఎలా చేరిందంటే… 1813 సంవత్సరంలో కోహినూర్ వజ్రం సిక్కు రాజు మహారాజా రంజిత్ సింగ్ దగ్గరికి వచ్చిందట. రంజిత్ సింగ్ కోహినూర్ ను తన కిరీటంలో ధరించారని తెలుస్తోంది. 1839లో రంజత్ సింగ్ మరణించిన తర్వాత ఆయన కుమారుడు దిలీప్ సింగ్ దగ్గరకు చేరింది కోహినూర్. 1849లో దిలీప్ సింగ్ ను ఓడించిన బ్రిటీష్ సేనలు ఆ వజ్రాన్ని ఇంగ్లండ్ రాణికి అప్పగించారని చెబుతోంది హిస్టరీ ఆఫ్ డైమండ్.

మరిన్ని జాతీయ వార్తల కోసం