
దేశంలో రెండు రాష్ట్రాల సరిహద్దులను కలుపుతూ నిర్మించిన బడిన రైల్వే స్టేషన్‌లు రెండు ఉన్నాయి. అందులో ఒకటి మధ్యప్రదేశ్- రాజస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఉండగా మరొకటి గుజరాత్-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో నిర్మించబడి ఉంది. మొదటగా రాజస్థాన్-మధ్య ప్రదేశ్ సరిహద్దులో ఉన్న రైల్వే స్టేషన్ విషయానికి వస్తే ఈ స్టేషన్ పేరు భవానీ మండి రైల్వే స్టేషన్. ఇది ఝలావర్ జిల్లాలో ఉంది. ఈ స్టేషన్ ప్రత్యేకత ఏమిటంటే మనకు టికెట్స్ ఇచ్చే వ్యక్తి మధ్య ప్రదేశ్‌లో ఉన్న ప్రాంతం నుంచి టికెట్స్ ఇస్తుంటే.. టికెట్ కొనే ప్రయాణికులు మాత్రం రాజస్థాన్‌లో ఉన్న ప్రాంతంలో క్యూలో నిలబడి ఉంటారు. ఇందుకు కారణం రైల్వే స్టేషన్ ఉత్తర భాగం మధ్య ప్రదేశ్ ఉండి, దక్షిణ భాగం రాజస్థాన్‌లో ఉండడమే.
ఇక రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో గల రెండో రైల్వే స్టేషన్ విషయానికి వస్తే ఈ స్టేషన్ పేరు నవాపూర్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ మహారాష్ట్ర-గుజరాత్ రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది. ఈ స్టేషన్ దక్షిణ భాగం మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో ఉండగా..ఉత్తర భాగం గుజరాత్‌లోని తాపి జిల్లాలో ఉంది. ఈ స్టేషన్‌కు ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే.. ఈ రైల్వే స్టేషన్‌లో ఆగే ట్రైన్ సగ భాగం గుజరాత్‌లో ఉంటే.. మిగిలిన సగం భాగం మహారాష్ట్రలో ఉంటుంది. ఈ స్టేషన్‌లో మనం ఇంకో అద్బుతాన్ని చూడవచ్చు. రెండు రాష్ట్రాలలకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు కనిపించేలా ఈ స్టేషన్‌ను నిర్మించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.