ఆయుధాలు పడవేసిన ఘటనలో ఖలిస్తాన్ ఉగ్రవాది అరెస్ట్

| Edited By:

Oct 03, 2019 | 9:08 PM

పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్లు ఆయుధాలు, మాదకద్రవ్యాలను పడవేసిన ఘటనకు సబంధించి అమృత్‌సర్‌లో మరో ఖలిస్తానీ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనకు సంబంధించి ఖలీస్తాన్ జిందాబాద్ ఫోర్స్ ఉగ్రవాది సజన్ ప్రీత్‌ను అమృత్‌సర్ ఖల్సా కాలేజీ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ సెల్ అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాది సజన్ ప్రీత్ ఇటీవల దొరికిన డ్రోన్‌ను ధ్వంసం చేయడం, ఎయిర్‌డ్రాప్ చేసిన రెండు పిస్టల్స్‌ను విక్రయించినట్టు ఆరోపణలున్నాయి. గత వారంలో పంజాబ్ సరిహద్దును దాటి ఆయుధాలను పడవేయడానికి వచ్చిన రెండు […]

ఆయుధాలు పడవేసిన ఘటనలో ఖలిస్తాన్ ఉగ్రవాది అరెస్ట్
Follow us on

పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్లు ఆయుధాలు, మాదకద్రవ్యాలను పడవేసిన ఘటనకు సబంధించి అమృత్‌సర్‌లో మరో ఖలిస్తానీ ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటనకు సంబంధించి ఖలీస్తాన్ జిందాబాద్ ఫోర్స్ ఉగ్రవాది సజన్ ప్రీత్‌ను అమృత్‌సర్ ఖల్సా కాలేజీ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ సెల్ అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాది సజన్ ప్రీత్ ఇటీవల దొరికిన డ్రోన్‌ను ధ్వంసం చేయడం, ఎయిర్‌డ్రాప్ చేసిన రెండు పిస్టల్స్‌ను విక్రయించినట్టు ఆరోపణలున్నాయి.
గత వారంలో పంజాబ్ సరిహద్దును దాటి ఆయుధాలను పడవేయడానికి వచ్చిన రెండు డ్రోన్లను ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

గత నెలలో ఒక డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, మరొకటి పంజాబ్‌లోని తార్న్ తరన్‌లోని జాబల్‌లో కాలిన స్థితిలో స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇండో పాక్ సరిహద్దు మీదుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పెద్ద సైజు డ్రోన్‌లో తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. జిహాదీ సంస్ధల ద్వారా ఖలిస్తానీ అనుకూల ఉగ్రవాద సంస్ధలకు ఇటువంటివి చేరడంపై జాతీయ భద్రతకు ముప్పుగా కేంద్ర భావిస్తోంది.