కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీకి చెందిన జూనియర్ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనపై యావత్ దేశం భగ్గుమంటోంది. బాధితురాలికి న్యాయం జరగగాలంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున పోస్టింగ్స్ చేస్తున్నారు, రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో విధుల్లో ఉన్న జూనియర్ వైద్యురాలి(31)పై అత్యాచారం చేసి హతమార్చిన ఘటనపై విచారణ జరుగుతోంది.
నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే వాలంటీర్ అయిన నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక కేసు విచారణలో భాగంగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మృతిరాలిపై సాముహిక హత్యాచారం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. విచారణలో భాగంగా తేలిన అంశాలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆమె మృతదేహంలో పెద్ద మొత్తంలో వీర్యాన్ని గుర్తించడమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఆమె శరీరంపై 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లు గుర్తించారు.
పోస్ట్ మార్టంలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె రహస్య అవయవాలతో పాటు కళ్లు, నోటి నుంచి రక్తస్రావం అయినట్లు గుర్తించారు. అలాగే.. ముఖం, గోళ్లు, కాళ్లు, మెడ, కుడి చేయి, పెదవులు, చేతి వేళ్లపై గాయాలైనట్లు పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. ఈ వివరాల ఆధారంగా మృతిరాలి పేరెంట్స్.. తమ కుమార్తెపై ఒకరి కంటే ఎక్కువ మంది అత్యాచారానికి పాల్పడి ఉంటారని పిటిషన్‌లో కోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం.
మృతిరాలి శరీరంపై అయిన గాయాలు చూస్తుంటే ఒక వ్యక్తి మాత్రమే దాడి చేసినట్లు కనిపించడం లేదని వైద్య నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. మృతురాలిపై 150 మిల్లీగ్రాముల వీర్యం ఉండడం చూస్తుంటే కచ్చితంగా, సాముహిక హత్యాచారం జరిగి ఉంటుందని అఖిల భారత ప్రభుత్వ వైద్యుల సమాఖ్య అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్ సుబర్ణ గోస్వామి అభిప్రాయపడ్డారు.ఈ వివరాల ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..