కేరళ ఏనుగు పోస్ట్‌మార్టం రిపోర్టు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

| Edited By:

Jun 05, 2020 | 7:26 PM

కేరళలో పేలుడు పదార్థాలు ఉన్న పండు తిని మృతి చెందిన గర్భవతి ఏనుగు పోస్ట్‌మార్టం రిపోర్ట్ విడుదలైంది. అందులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి.

కేరళ ఏనుగు పోస్ట్‌మార్టం రిపోర్టు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
Follow us on

కేరళలో పేలుడు పదార్థాలు ఉన్న పండు తిని మృతి చెందిన గర్భవతి ఏనుగు పోస్ట్‌మార్టం రిపోర్ట్ విడుదలైంది. అందులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఏనుగు నోటిలో పేలుడు సంభవించడం కారణాలంగా తీవ్రమైన గాయాలయ్యాయని, వాటి వలన ఇన్‌ఫెక్షన్ సైతం సోకినట్లు అందులో తేలింది. ఇన్‌ఫెక్షన్‌ కారణంగా అధిక నొప్పి, ఒత్తిడితో బాధపడుతూ ఏనుగు నీరు, ఆహారం తీసుకోలేకపోయిందని రిపోర్టులో వెల్లడైంది. ఈ క్రమంలో రెండు వారాలుగా ఆ ఏనుగు నీరు, తిండి లేకుండా గడిపిందని తేలింది.

ఆ తరువాత నీరసానికి గురి కావడంతో ఏనుగు పెద్ద మొత్తంలో నీటిని తీసుకుందని.. దాని వలన ఊపిరితిత్తులు పాడై మరణించినట్లు వెల్లడైంది. ఏనుగు వయసు దాదాపు 15 సంవత్సరాలు ఉంటుందని, దాని శరీరంలో బుల్లెట్‌, ఇతర లోహాల అవశేషాలేవీ కనిపించలేదని రిపోర్టులో తేలింది. కాగా ఏనుగు మృతి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మనుషుల్లో మానవత్వం లేకుండా పోయిందంటూ సెలబ్రిటీలు మొదలు సామాన్యులు ఏనుగు మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన అధికారులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Read This Story Also: అందుకే శ్రుతీ అంటే నాకు చాలా ఇష్టం: తమన్నా