Sri Krishna Painting: నెరవేరిన ఆరేళ్ల కల.. శ్రీకృష్ణుడికి ముస్లిం యువతి బహుమతి.. ఏమిటది?

| Edited By: Janardhan Veluru

Sep 29, 2021 | 2:55 PM

కళకు మతంతో పని లేదు.. భక్తికి కూడా మతంతో పని లేదు. హిందువులు ముస్లిం దేవుళ్లను పూజిస్తారు. ముస్లింలు హిందూ దేవతలను పూజిస్తారు. ఇలా...

Sri Krishna Painting: నెరవేరిన ఆరేళ్ల కల.. శ్రీకృష్ణుడికి ముస్లిం యువతి బహుమతి.. ఏమిటది?
Jasna
Follow us on

కళకు మతంతో పని లేదు.. భక్తికి కూడా మతంతో పని లేదు. హిందువులు ముస్లిం దేవుళ్లను పూజిస్తారు. ముస్లింలు హిందూ దేవతలను పూజిస్తారు. ఇలా మతంతో సంబంధం లేకుండా దేవుళ్లను అరాధిస్తారు. ఇలా ఓ ముస్లిం యువతి శ్రీకృష్ణుడి చిత్రాన్ని గీసి తన భక్తిని చాటుకుంది. ఆరు సంవత్సరాల్లో 500పైగా కృష్ణుడి చిత్రాలు గీసిన ఆమె ఒక్క చిత్రాన్ని కూడా దేవుడి ముందు ఉంచలేకపోయింది. గత ఆదివారం ఓ 28 ఏళ్ల యువకుడు ఆమె కలను సాకారం చేశాడు. ఆమె గీసిన కృష్ణుడి చిత్రాన్ని దేవుడి ముందు ఉంచాడు.

కేరళలోని కోజికోడ్‌కు చెందిన జస్నా సలీమ్ అనే ముస్లిం మహిళ కొన్ని సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడి చిత్రాలు గీస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె గత ఆరు సంవత్సరాలుగా 500కి పైగా కృష్ణుడి చిత్రాలను చిత్రించినప్పటికీ, ఆలయం లోపల ఆమె పెయింటింగ్‌ను ప్రదర్శించే అవకాశం ఇంతవరకు రాలేదు. గత ఆదివారం, 28 ఏళ్ల యువకుడు ఆమె చిరకాల స్వప్నాన్ని నెరవేర్చాడు. శ్రీకృష్ణుడి చిత్రపటాన్ని గుడిలో ఉంచాడు. పండలంలోని ఉలనాడు శ్రీకృష్ణ స్వామి ఆలయంలో తన కోరికను నెరవేర్చగలిగినందుకు సంతోషిస్తున్నానని ఆమె చెప్పింది. “నా ఆనందాన్ని వ్యక్తం చేయడానికి నా దగ్గర పదాలు లేవని.. ఆలయ అధికారులకు నా కృతజ్ఞతలు “అని జస్నా అన్నారు.

ఆమె కృష్ణుడి చిత్రాలు సోషల్ మీడియాలో పట్టడంతో ఉలనాడు శ్రీ కృష్ణ స్వామి దేవాలయానికి బహుమతిగా ఇవ్వడానికి ఒక చిత్రపటాన్ని గీయాలని కోరుతూ ఒక భక్తుల బృందం ఆమెను సంప్రదించింది. దీంతో ఆమె కోరిక నెరవేరింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన జస్నా శిక్షణ పొందిన కళాకారిణి కాదు. ఆమె తన పాఠశాల రోజుల్లో డ్రాయింగ్‌ వేసేది. “మ్యాప్ గీయమని ఉపాధ్యాయులు అడిగినప్పుడు నా చేతులు వణికాయని. నేను అనుకోకుండా శ్రీకృష్ణుడి చిత్రాలను గీయడం ప్రారంభించానని ఆమె చెప్పింది.

మా కుటుంబంలో ముగ్గురు సోదరీమణుల్లో నేను చిన్నదాన్ని. బాల్యం నుంచి నా తల్లిదండ్రులు నన్ను ‘కన్న’ అని ప్రేమగా పిలిచేవారు. నేను శ్రీకృష్ణుడి చిత్రాన్ని చూసినప్పుడు, అలాంటి ఒక చిత్రాన్ని చిత్రించాలనే కోరిక నాలో కలిగింది “అని జస్నా చెప్పారు. ఆమె తన మొదటి పెయింటింగ్‌ను తన హిందూ స్నేహితురాలికి బహుమతిగా ఇచ్చారు. నా పెయింటింగ్‌ను వారి ఇంట్లో పెట్టిన తర్వాత వారి జీవితంలో చాలా మంచి మార్పులు జరిగాయని తన స్నేహితురాలు చెప్పినట్లు ఆమె చెప్పింది. అది తనకు స్ఫూర్తినిచ్చిందని.. ఆ తర్వాత చాలా మంది శ్రీకృష్ణుడి చిత్రాల కోసం నన్ను సంప్రదించారని జస్నా చెప్పారు.

Read also.. Dope Test: డీజీసీఏ కీలక నిర్ణయం.. ఇక నుంచి వారికి కూడా డోప్‌ టెస్ట్‌.. ఉత్తర్వులు జారీ

Viral Video: వరదల్లో చిక్కుకుపోయిన వీధి కుక్క.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరోలు