గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకుంటే.. నట్టేట ముంచింది.. ముగ్గురికి సీరియస్..!

గూగుల్ మ్యాప్స్ వచ్చాక ప్రయాణం మరింత సులభతరం అయ్యింది. మరీ ముఖ్యంగా నగరాల్లో గూగుల్ మ్యాప్స్ లేని ప్రయాణాన్ని ఊహించుకోలేనంత పరిస్థితి ఉంది. దారి తెలియని సందర్భాల్లో గూగుల్ మ్యాప్స్ ఎంతగానో మేలు చేస్తాయి. అయితే, వీటిని గుడ్డిగా నమ్మితే మాత్రం కొంప కొల్లేరవుతుంది.

గూగుల్‌ మ్యాప్‌ను నమ్ముకుంటే.. నట్టేట ముంచింది.. ముగ్గురికి సీరియస్..!
Ai Image

Updated on: Jun 01, 2025 | 8:49 PM

గూగుల్ మ్యాప్స్ వచ్చాక ప్రయాణం మరింత సులభతరం అయ్యింది. మరీ ముఖ్యంగా నగరాల్లో గూగుల్ మ్యాప్స్ లేని ప్రయాణాన్ని ఊహించుకోలేనంత పరిస్థితి ఉంది. దారి తెలియని సందర్భాల్లో గూగుల్ మ్యాప్స్ ఎంతగానో మేలు చేస్తాయి. అయితే, వీటిని గుడ్డిగా నమ్మితే మాత్రం కొంప కొల్లేరవుతుంది. గూగుల్‌ మ్యాప్స్‌ను గుడ్డిగా నమ్మితే ప్రమాదాలు తప్పవని వరుసగా జరుగుతోన్న సంఘటనలు కూడా హెచ్చరిస్తున్నాయి. ఆదివారం(జూన్ 01) మరో ఘటన వెలుగు చూసింది.

కేరళలోని కన్నూర్‌లో గూగుల్ మ్యాప్స్‌ను అనుసరిస్తూ వెళ్లిన ఓ కారు.. దారి తప్పి చెరువులోకి దూసుకుపోయింది. రూట్ తెలియ‌క‌పోవ‌డంతో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకుని ముందుకు వెళ్లారు. ఇంత‌లో మెయిన్ రోడ్డు నుంచి రూట్ మారింది. వేరే రూట్ చూపించడంతో షార్ట్ కట్ అనుకుని, కారును అటు తిప్పారు డ్రైవర్. కొంతదూరం వెళ్లగానే కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకు పోయింది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు.

మునిగిపోతున్న కారును తాళ్లతో బంధించి, ఐదుగురిని ఒడ్డుకు తీసుకొచ్చారు. గాయపడ్డ వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గూగుల్ మ్యాప్ రాంగ్ రూట్ చూపించడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. టెక్నికల్ లోపమా లేకా ప్రమాదానికి మరోదైనా కారణమా అన్న కోణంతో దర్యాప్తు చేస్తున్నారు.

గూగుల్ మ్యాప్ కొన్ని సార్లు తప్పుడు సమాచారం అందిస్తుందని ఇటీవల చాలా కంప్లైంట్లు వస్తు్న్నాయి. దీంతో గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగించే సమయంలో కచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. స్థానికులను అడ్రస్‌ అడుగుతూ.. మ్యాప్‌ చూస్తున్న మార్గాన్ని క్రాస్‌ చెక్‌ చేసుకుంటూ ముందుకు వెళ్లాలంటున్నారు. మ్యాప్స్‌ యాప్‌ను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్‌ వెర్షన్‌ ఉండేలా చూసుకుంటే.. ఏవైనా మార్పులు ఉంటే ముందే గమనించవచ్చని చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..