కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు, నిందితుల జుడిషియల్ కస్టడీ పొడిగింపు

| Edited By: Anil kumar poka

Sep 19, 2020 | 10:57 AM

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో 12 మంది నిందితుల జుడిషియల్ కస్టడీని కొచ్చి లోని ఎన్ఐఏ కోర్టు అక్టోబరు 8 వరకు పొడిగించింది. స్వప్న సురేష్ సహా వీరందరినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరిచారు.

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు, నిందితుల జుడిషియల్ కస్టడీ పొడిగింపు
Follow us on

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో 12 మంది నిందితుల జుడిషియల్ కస్టడీని కొచ్చి లోని ఎన్ఐఏ కోర్టు అక్టోబరు 8 వరకు పొడిగించింది. స్వప్న సురేష్ సహా వీరందరినీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరు పరిచారు. తన ఆరోగ్య కారణాల దృష్ట్యా తనకు బెయిలు ఇవ్వాలన్న స్వప్న అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అయితే జైల్లో ఉన్నప్పటికీ, తన బంధువులను కలుసుకునేందుకు స్వప్నకు అనుమతి లభించింది. కాగా కేరళలో ఇంకా ఈ కేసు నేపథ్యంలో.. ప్రభుత్వ రాజీనామాకు పట్టు బడుతూ ప్రతిపక్షాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. విపక్ష నేత రమేష్ చెన్నితాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.