ఉగ్రవాడులకు సాయం చేశాడని పోలీసులు తీసుకెళ్లారు! కట్‌ చేస్తే.. నదిలో శవమై దొరికాడు! ఏం జరిగిందంటే..?

కుల్గాం జిల్లాలో 22 ఏళ్ల ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే మృతదేహం నదిలో లభ్యమైంది. ఉగ్రవాదులకు సహాయం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న అతన్ని ఇటీవల పహల్గాం దాడి తర్వాత అధికారులు అరెస్టు చేశారు. అతను అనుమానాస్పదంగా మృతి చెందడంతో, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేతలు కుట్రాంశాలున్నాయని ఆరోపిస్తున్నారు.

ఉగ్రవాడులకు సాయం చేశాడని పోలీసులు తీసుకెళ్లారు! కట్‌ చేస్తే.. నదిలో శవమై దొరికాడు! ఏం జరిగిందంటే..?
Kashmir Ogw Death

Updated on: May 05, 2025 | 11:57 AM

జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని ఒక వాగులో ఉగ్రవాదులకు సహాయం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 ఏళ్ల వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే ఉగ్రవాదులకు OGW (ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్‌)గా సహాయం చేశాడని అధికారులు అనుమానిస్తున్నారు. ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత విచారణ కోసం తీసుకెళ్లారు. అడవిలో దాక్కున్న ప్రదేశాన్ని గుర్తించే ఆపరేషన్‌లో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండగా అతను నదిలోకి దూకాడని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు ప్రారంభించారు. మాగ్రే మృతదేహాన్ని వెలికితీసిన కొన్ని గంటల తర్వాత బయటపడిన డ్రోన్ ఫుటేజ్‌లో ఒక యువకుడు ఉప్పొంగుతున్న అద్బాల్ ప్రవాహంలోకి దూకి, కొట్టుకుపోతున్నట్లు చూపించారు. ఇంతియాజ్ అహ్మద్ మాగ్రే మరణంపై పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ లోక్‌సభ సభ్యుడు అగా రుహుల్లా మెహదీ, జమ్మూ కాశ్మీర్ మంత్రి సకీనా ఇట్టూ అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో ఏదో కుట్ర దాగుందని అంటున్నారు.

విశ్వసనీయ నివేదికల ప్రకారం.. మాగ్రేను భద్రతా దళాలు కొన్ని రోజుల క్రితం తీసుకెళ్లాయి. తాజాగా అతని మృతదేహాన్ని అతని కుటుంబానికి తిరిగి ఇచ్చారు. ఏకపక్ష నిర్బంధం, కస్టడీ హత్యలు, హింసలు ప్రజాస్వామ్య, చట్టపరమైన సూత్రాన్ని ఉల్లంఘించడమే అని మెహదీ అన్నారు. మాగ్రే మరణంపై దర్యాప్తుకు అతని కుటుంబం చేస్తున్న డిమాండ్‌ను సమర్థించాలని శ్రీనగర్‌కు చెందిన లోక్‌సభ సభ్యుడు అన్నారు. ఎక్స్‌లో చేసిన ఒక పోస్ట్ లో మెహబూబా ముఫ్తీ ఇలా అన్నారు.. “కుల్గాంలోని ఒక నది నుండి మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు, దీనిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. రెండు రోజుల క్రితం ఇంతియాజ్ మాగ్రేను సైన్యం తీసుకెళ్లిందని, ఇప్పుడు అతని మృతదేహం నదిలో అనుమానాస్పద స్థితిలో దొరికిందని స్థానిక నివాసితులు ఆరోపిస్తున్నారు.” ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. ఈ దాడి కశ్మీర్‌లో శాంతిని దెబ్బతీసేందుకు, పర్యాటకాన్ని దెబ్బతీసేందుకు, దేశవ్యాప్తంగా మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు జరిగిన ప్రణాళిక ప్రయత్నంగా కనిపిస్తోందని మాజీ ముఖ్యమంత్రి అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి