Gyanvapi Controversy: కాశీ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో గౌరీ దేవి ప్రతిమలపై సర్వే.. కోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తున్న ముస్లిం సంఘాలు

|

May 06, 2022 | 10:07 PM

Gyanvapi Masjid Controversy: కాశీ జ్ఞానవాపి మసీదు వివాదం మరింత ముదిరింది. కోర్టు ఆదేశాలతో మసీదులో సర్వే చేపట్టారు అధికారులు. కాశీ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార్‌ గౌరీ ప్రతిమలపై సర్వే జరపాలని కోర్టు ఆదేశించింది.

Gyanvapi Controversy: కాశీ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో గౌరీ దేవి ప్రతిమలపై సర్వే.. కోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తున్న ముస్లిం సంఘాలు
Gyanvapi Mosque
Follow us on

Kashi Vishwanath Temple Vs Gyanvapi Mosque: ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో హైడ్రామా నడుస్తోంది. కాశీ జ్క్షానవాపి మసీదులో కోర్టు ఆదేశాలతో సర్వే జరుగుతోంది. గట్టి భద్రత మధ్య సర్వే చేస్తున్నారు కోర్టు అధికారులు. జ్ఞానవాపి మసీదు లోపల ఎట్టి పరిస్థితుల్లో సర్వేకు, వీడియోగ్రఫీకి అనుమతి లేదంటున్నారు నిర్వాహకులు. సర్వే సిబ్బందిని అడ్డుకోవడానికి వాళ్లు ప్రయత్నంచడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అధికారులు వారికి నచ్చచెప్పారు. కాశీలోని విశ్వనాథ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో సర్వే చేయడం వివాదాస్పదంగా మారింది. స్థానిక కోర్టు ఆదేశాల మేరకు “శృంగార్‌ గౌరీ స్థల్‌” పునాదులపై సర్వేలో భాగంగా జ్ఞానవాపి మసీదులో వీడీయోగ్రఫీ చేస్తున్నారు. అయితే అన్యమతస్తులు మసీదులోకి రాకూడదంటూ స్థానిక ముస్లింలు వ్యతిరేకించారు. ఈ సర్వే మూడు నుంచి నాలుగు రోజులు పడుతుందని చెబుతున్నారు.

కోర్టు సర్వే చేయాలని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని జ్ఞానవాపి మసీదు నిర్వాహకులు చెబుతున్నారు. పరిశీలన కోసమే వెళ్లాలని సూచించినట్టు తెలిపారు. ఏప్రిల్‌ 26వ తేదీన కాశీ విశ్వనాథ్‌-జ్క్షానవాపి మసీదు కాంప్లెక్స్‌లో సర్వే చేయాలని కోర్టు ఆదేశించింది. మసీదు ప్రాంగణం లోని రెండు బేస్‌మెంట్‌ల్లో సర్వే చేయాలని న్యాయమూర్తి సూచించారు.

కాశీ జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార్‌ గౌరీ తదితర ప్రతిమలకు పూజలు చేసుకోవడానికి అనుమతించాలని గత ఏడాది నలుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది మే 10 లోగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని వారణాసి సెషన్స్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాశీ -జ్ఞానవామి మసీదు వివాదం 1991 నుంచి కోర్టులొ నడుస్తోంది. అలహాబాద్‌ హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

Gauri Status

అయోధ్య వివాదంతో పోలిస్తే కాశీ -జ్క్షానవాపి మసీదు వివాదానికి తేడా ఉంది. అయోధ్యలో కేవలం మసీదు మాత్రమే గతంలో వివాదానికి కేంద్ర బిందువుగా ఉంటే కాశీలో మాత్రం మసీదుతో పాటు ఆలయం కూడా ఉన్నాయి. అయితే ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారని హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి.

జాతీయ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి: Governor Tamilisai: సరూర్ నగర్ హత్యపై డిటేల్డ్ రిపోర్టు తెప్పించండి.. అధికారులను ఆదేశించిన గవర్నర్ తమిళిసై..

AP Politics: సీఎం జగన్‌ మాటే మా బాట.. ఊహాగానాలకు చెక్ పెట్టిన వైసీపీ ట్రబుల్ షూటర్లు..

Minister Srinivas Goud: ఎక్కువ మాట్లాడితే నాలుక కోస్తా.. బండి సంజ‌య్‌కు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఫైర్..