స్పీకర్‌దే ఫైనల్ : సుప్రీం

| Edited By: Pardhasaradhi Peri

Jul 17, 2019 | 11:35 AM

కన్నడ రాజకీయం మళ్లీ ఉత్కంఠ రేపబోతోంది. ఎమ్మెల్యేల రాజీనామాల అంశంపై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. రాజీనామాల నిర్ణయాధికారం స్పీకర్‌దేనని స్పష్టం చేసింది. అయితే గురువారం జరగబోయే బల పరీక్షకు వెళ్లడం.. వెళ్లకపోవడం అనేది ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయమని తెలిపింది.  రేపు కుమారస్వామి సర్కార్ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది. సభలో ప్రతిపాదించనున్న అవిశ్వాస తీర్మానంపై ఎంత మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను స్పీకర్ […]

స్పీకర్‌దే ఫైనల్  : సుప్రీం
Follow us on

కన్నడ రాజకీయం మళ్లీ ఉత్కంఠ రేపబోతోంది. ఎమ్మెల్యేల రాజీనామాల అంశంపై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది. రాజీనామాల నిర్ణయాధికారం స్పీకర్‌దేనని స్పష్టం చేసింది. అయితే గురువారం జరగబోయే బల పరీక్షకు వెళ్లడం.. వెళ్లకపోవడం అనేది ఎమ్మెల్యేల వ్యక్తిగత అభిప్రాయమని తెలిపింది.  రేపు కుమారస్వామి సర్కార్ అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోనుంది. సభలో ప్రతిపాదించనున్న అవిశ్వాస తీర్మానంపై ఎంత మంది ఎమ్మెల్యేలు ఏ విధంగా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 15 మంది రెబెల్ ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను స్పీకర్ ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని తమ పిటిషన్‌లలో ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే వీరి రాజీనామాలను ఆమోదించాలా.. లేక వీరి అనర్హతపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై విచక్షణాధికారం స్పీకర్ కే ఉంటుందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తో కూడిన ముగ్గురు సభ్యలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

మరోవైపు తన ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ఢోకా లేదని సీఎం కుమారస్వామి ధీమాతో ఉన్నారు. సభలో మెజారిటీని నిరూపించుకుంటానని ఇదివరకే ప్రకటించారు. కాగా, రెబెల్ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావాలా.. వద్దా అన్న విషయమై నిర్ణయాధికారాన్ని కోర్టు వారికే వదిలేయడంతో.. కుమారస్వామి ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందన్న వార్తలు కూడా వస్తున్నాయి.