Malur MLA KY Nanjegowda: దసరా వేడుకల్లో భాగంగా ఓ ఎమ్మెల్యే గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో సంచలనంగా మారింది. దసరా వేడుకల్లో కర్ణాటక కోలారు జిల్లా మాలూరు ఎమ్మెల్యే కేవై నంజేగౌడ గాలిలోకి కాల్పులు జరిపారు. మాలూరు నియోజకవర్గంలోని కొమ్మనహళ్లి గ్రామంలో జమ్మిచెట్టు వద్ద ఆయుధాలకు శుక్రవారం పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే నంజేగౌడ ఇదే నాటు తుపాకీతో గాలిలోకి నాలుగురౌండ్ల పాటు కాల్పులు జరిపారు. ఎమ్మెల్యే నంజేగౌడ సోదరుడి పేరిట తుపాకీ లైసెన్సు ఉంది.
కాగా.. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మరాయి. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. గాలిలోకి కాల్పులు జరిపిన ఘటనలో ఎమ్మెల్యే నంజేగౌడ, తుపాకీ లైసెన్స్ కలిగిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే బహిరంగా ప్రదేశంలో కాల్పులు జరిపి.. చట్టాన్ని ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. దసరా ఉత్సవాల్లో కొమ్మనహళ్లి గ్రామంలో గాలిలోకి కాల్పులు జరపడం సంప్రదాయంగా ఉందని.. గ్రామస్థులు పేర్కొంటున్నారు.
Also Read: