Viral Video: ఎంత అందంగా ఉన్నానో కదా.. అద్దంలో చూసుకొని మురిసిపోయిన కోతి.. ఫన్నీ వీడియో

Monkey Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. వైరల్ అయ్యే

Viral Video: ఎంత అందంగా ఉన్నానో కదా.. అద్దంలో చూసుకొని మురిసిపోయిన కోతి.. ఫన్నీ వీడియో
Monkey Viral Video
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 17, 2021 | 1:29 PM

Monkey Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. వైరల్ అయ్యే వీడియోల్లో జంతువులకు సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. జంతువులు ప్రత్యేక హావాభావాలతో.. అందరినీ ఫిదా చేస్తుంటాయి. సాధారణంగా మనం రోజూ ఒక్కసారైనా అద్దంలో మనల్ని మనం చూసుకుంటుంటాం. ఇంకా.. ఏదో ఒక సందర్భంలో అద్దం ముందు నిల్చొని అందాన్ని తనివితీరా చూసుకుంటూ మురిసిపోతూ.. ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఎంజాయ్ కూడా చేస్తుంటాం. అయితే.. ఇక్కడ ఓ కోతి అద్దంలో చూసుకుంటూ మైమరిచిపోయింది. బైక్‌ అద్దంలో తనను తాను చూసుకుంటూ.. హావాభావాలను పరీక్షించుకుంటూ ఓ కోతి నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూడండి.. వైరల్ వీడియో..

ఈ వీడియోలో బైక్‌ మీద ఓ కోతి కూర్చొని ఉంది. ఒక చేతితో బైక్‌ హ్యండిల్‌ పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ ఉంటుంది. అద్దం వైపు చూసి అందులో తన ప్రతిబింబం కనిపిస్తుండంతో కోతి ఒక్కసారిగా షాక్‌ అవుతోంది. తన ఎదురుగా మరో కోతి ఉందనుకొని కంగారు పడుతుంది. అద్దంలో మళ్లీ అదే ప్రతిభింభం కనిపించగా.. కోపంతో అద్దం మీద కొడుతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హెలికాప్టర్ యాత్ర అనే ఇన్‌స్టా యూజర్ ఈ వీడియోను షేర్ చేయగా.. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కోతి అద్దంలో చూసుకుంటూ మైమరిచిపోతోందని కామెంట్ చేస్తున్నారు.

Also Read:

Viral Video: కిలాడీలను మించిన దొంగ కుక్క.. గప్‌చుప్‌గా మటన్ ముక్క మాయం.. సీన్ చూస్తే నవ్వులే నవ్వులు..

CM MK Stalin: 6వ తరగతి విద్యార్థినికి ఫోన్ చేసిన సీఎం.. ఎందుకో తెలిస్తే షాకవుతారు..