Kolar Farmers: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన కోలార్ రైతులు.. అన్నమో రామచంద్రా అని పాక్ ప్రజలు అనాల్సిందేనా

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన మారణహోమంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఉగ్రవాదులను ఎగదోసి మన దేశంలో మరణ హోమం సృష్టిస్తున్న పాకిస్తాన్‌పై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన ప్రతీకారం తీర్చుకుంటుంది. అనేక పరిమితులు విదిస్తూనే ఉంది. దీంతో పాకిస్తాన్ మందులు సహా రోజువారీ అవసరాల కోసం ఇబ్బంది పడుతోంది. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు ఇప్పుడు కోలార్‌లోని రైతులు, వ్యాపారులు సర్జికల్ స్ట్రైక్‌ను ప్రారంభించారు. పాకిస్తాన్‌కు టమోటా ఉత్పత్తుల ఎగుమతిని పూర్తిగా నిలిపివేశారు.

Kolar Farmers: పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చిన కోలార్ రైతులు.. అన్నమో రామచంద్రా అని పాక్ ప్రజలు అనాల్సిందేనా
Karnataka Kolar Farmers

Updated on: May 01, 2025 | 7:55 PM

దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పటికే ద్రవ్యోల్బణం, ఆర్ధిక సంక్షోభం, ఆహార సంక్షోభం వంటి వాటితో ఇబ్బంది పడుతూనే ఉంది. పాక్ వాసులకు తినడానికి తిండి కూడా లభించని స్టేజ్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు చేసిన దాడి నేపధ్యంలో పాకిస్తాన్ పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుంది. అంతేకాదు భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్ వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు ఇప్పుడు కర్ణాటక రైతులు తమ వంతు అన్నట్లు పాక్ దేశానికి టమాటా ఎగుమతులు నిలిపివేశారు.

కోలార్ APMC మార్కెట్ మొత్తం ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద టమోటా మార్కెట్‌గా గుర్తింపు పొందింది. అదే కారణంతో కోలార్ జిల్లాలో పండించే నాణ్యమైన టమోటాలు దేశంలోని చాలా రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తారు. జూన్, జూలై నెలలు టమోటా పంట కోతకు అనువైన నెలలు. ఈ సందర్భంగా ఇక్కడి రైతులు కోలార్ నుంచి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, దుబాయ్ వంటి వివిధ దేశాలకు టమోటాలను ఎగుమతి చేస్తారు. అయితే ఇటీవల కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు ఉగ్రవాద దాడి చేసి 27 మందిని చంపారు. దీని కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్తాన్‌పై దౌత్యపరంగా అనేక చర్యలు చేపట్టింది. ఇప్పుడు కోలార్‌లోని రైతులు తాము పండించిన టమోటాలను పాకిస్తాన్‌కు ఎగుమతి చేయడం నిలిపి వేశారు. ఇలాంటి చర్యలతో కోలార్ రైతులు పాకిస్తాన్‌ను కూడా దిగ్భ్రాంతికి గురిచేశారు.

పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దౌత్యపరమైన చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కోలార్ లోని రైతులు, వ్యాపారులు పాకిస్తాన్ పై మరో సర్జికల్ స్ట్రైక్ ప్రకటించారు. కోలార్ నుంచి పాకిస్తాన్‌కు టమోటాలు సరఫరా చేయడంపై పూర్తి నిషేధం ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌కు టమోటాలు సరఫరా చేయకూడదని రైతులు నిర్ణయించుకున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రతి సంవత్సరం కోలార్ నుంచి 800 నుంచి 900 టన్నుల టమోటాలు పాకిస్తాన్‌కు సరఫరా అయ్యేవి. అయితే పహల్గామ్ దాడి నేపథ్యంలో వ్యాపారులు ఇకపై పాకిస్తాన్‌కు ఒక్క టమోటా కూడా పంపకూడదని నిర్ణయించుకున్నారు. ఇక్కడి వ్యాపారులకు పాకిస్తాన్ తో విడదీయరాని సంబంధం ఉంది. వాళ్ళు టమోటాలతో పాటు కూరగాయలను కూడా పంపేవారు. దీని ద్వారా ఇక్కడి రైతులు, వ్యాపారులు పాకిస్తాన్‌తో కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నారు. అయితే ఉగ్రవాదులు మతం అడిగి మరీ మరణ హోమం సృష్టించడంతో రైతులు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మారారు.

ఉగ్రవాదులు.. వారి సంస్థల నుంచి దూరం పాటించాలని సలహా

తమకు నష్టాలు కలిగినా పాకిస్తాన్‌కు టమోటాలు ఎగుమతి చేయడమని రైతులు చెబుతున్నారు. 2013లో పుల్వామా దాడి సమయంలో పాకిస్తాన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు.. కోలార్ రైతులు కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్ కు కోలార్ నుంచి టమోటాల ఎగుమతిని నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తాము కట్టుబడి ఉన్నామని కోలార్ రైతులు కూడా చెబుతున్నారు.

పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేయడం మానెయ్యాలని.. కేంద్ర ప్రభుత్వం నీరు.. ఇతర వస్తువులపై ఆంక్షలు విధించగా, కోలార్ రైతులు ఒక అడుగు ముందుకు వేసి టమోటాలు, కూరగాయల సరఫరాని నిలిపివేసి పాక్ ప్రజలకు షాక్ ఇచ్చారు. దీని వలన పాకిస్తాన్ ప్రజలు టమోటాలు, కూరగాయల కోసం ఇబ్బంది పడటం అనివార్యం.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..