Hijab Issue: మళ్లీ తెరపైకి హిజాబ్ వివాదం.. పరీక్షలకు హాజరుకాని 40 మంది విద్యార్థినులు..

|

Mar 31, 2022 | 6:00 AM

Karnataka Hijab Row: కర్ణాటకలో రాజుకున్న హిజాబ్‌ వివాదం, దేశం మొత్తం ప్రకంపనలు సృష్టించింది. అక్కడి హైకోర్టు తీర్పుతో చల్లారింది అనుకున్నా, ప్రీ యూనివర్సిటీ పరీక్షలతో మళ్లీ హైటెన్షన్‌

Hijab Issue: మళ్లీ తెరపైకి హిజాబ్ వివాదం.. పరీక్షలకు హాజరుకాని 40 మంది విద్యార్థినులు..
Karnataka Hijab Issue
Follow us on

Karnataka Hijab Row: కర్ణాటకలో రాజుకున్న హిజాబ్‌ వివాదం, దేశం మొత్తం ప్రకంపనలు సృష్టించింది. అక్కడి హైకోర్టు తీర్పుతో చల్లారింది అనుకున్నా, ప్రీ యూనివర్సిటీ పరీక్షలతో మళ్లీ హైటెన్షన్‌ క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హిజాబ్‌ వివాదం మరో టర్న్ తీసుకుంది. హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చినా, దానిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కొందరు విద్యార్థినులు. విద్యాసంస్థల్లోని తరగతి గదుల్లో హిజాబ్ ధరించకూడదని ఇటీవల కర్ణాటక హైకోర్టు ఇచ్చింది. ఈ తీర్పు నేపథ్యంలో కర్ణాటకలోని ఉడిపి జిల్లాకు చెందిన 40 మంది ముస్లిం విద్యార్థినులు మొదటి ప్రీ యూనివర్సిటీ పరీక్షకు హాజరుకాలేదు. మార్చి 15న జారీ చేసిన ఉత్తర్వుల వల్ల మనస్తాపానికి గురైన విద్యార్థులు, హిజాబ్ ధరించకుండా పరీక్షకు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో కుందాపూర్‌కు చెందిన 24 మంది, బైందూరుకు చెందిన 14 మంది, ఉడిపి ప్రభుత్వ బాలికల పియు కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఉన్నారు. వీరంతా తరగతి గదుల్లో హిజాబ్ ధరించడాన్ని నిషేధించడంపై, న్యాయ పోరాటం చేస్తున్నారు. ఈ విద్యార్థినులు గతంలో ప్రాక్టికల్ పరీక్షలను బహిష్కరించారు.

ఆర్‌ఎన్ శెట్టి పీయూ కళాశాలలో 28 మంది ముస్లిం విద్యార్థినుల్లో కేవలం 13 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. మరికొందరు విద్యార్థులు హిజాబ్‌లు ధరించి పరీక్షా కేంద్రానికి చేరుకున్నప్పటికీ, వారికి అనుమతి లభించలేదు. ఉడిపిలోని భండార్కర్ కళాశాలలో ఐదుగురు బాలికల్లో నలుగురు విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, బస్రూర్ శారద కళాశాలలో బాలికలందరూ పరీక్షలకు హాజరయ్యారు. నవుండ ప్రభుత్వ పియూ కళాశాలలో ఎనిమిది మంది బాలికల్లో ఆరుగురు విద్యార్థులు పరీక్షలకు రాలేదు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులు హిజాబ్ ధరించి పరీక్షలకు హాజరయ్యేందుకు అనుమతించినా, ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు. అటు ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, దాఖలైన పిటిషన్లపై అత్యవసర విచారణకు మార్చి 24న సుప్రీంకోర్టు నిరాకరించింది. హిజాబ్‌ ఇష్యూపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చేవరకు వేచి చూడాలని విద్యార్థినులు యోచిస్తున్నారు.

Also Read:

Punjab CM: పంజాబ్ సీఎం మరో కీలక నిర్ణయం.. స్కూళ్లలో ఫీజుల పెంపుపై నిషేధం

Birbhum Violence: బీర్భూమ్ హింసాకాండపై బీజేపీ నివేదిక.. సంచలన వ్యాఖ్యలు చేసిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ