Telugu News India News Karnataka HC dismisses pleas in on going Hijab row case political leaders rections here
Hijab Row Case: హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పు.. నేతల రియాక్షన్స్ ఇవీ..
హిజాబ్‌పై కర్ణాటక హైకోర్ట్ తీర్పు ఇచ్చిన సంచలన తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో హిజాబ్‌పై కర్ణాటక హైకోర్ట్ మంగళవారంనాడు(మంగళవారంనాడు) కీలక తీర్పు వెలువరించింది.
Hijab Row Case: హిజాబ్‌పై కర్ణాటక హైకోర్ట్ తీర్పు ఇచ్చిన సంచలన తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటకలో హిజాబ్‌పై కర్ణాటక హైకోర్ట్ మంగళవారంనాడు(మంగళవారంనాడు) కీలక తీర్పు వెలువరించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదని..యూనిఫామ్ మాత్రమే ధరించాలని తేల్చి చెప్పింది. హిజాబ్‌పై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టేసింది.కొందరు ఈ తీర్పును స్వాగతిస్తుండగా.. మరికొందరు ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధమంటూ పెదవి విరుస్తున్నారు. కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్తామని అసదుద్దీన్ అంటుంటే..ఈ జడ్జిమెంట్‌ను బీజేపీ నేతలు స్వాగతిస్తున్నారు. కర్ణాటక హైకోర్టు తీర్పుపై పలువురు రాజకీయ ప్రముఖుల రియాక్షన్స్ ఇలా ఉన్నాయి.
కర్ణాటక హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దమని మజ్లిస్ ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ అసంతృప్తి వ్యక్తంచేశారు. ముస్లిం బాలికలు హిజాబ్ ధరిస్తే ఎవరికి ఇబ్బంది కలుగుతుందో అర్ధం కావడం లేదన్నారు. మతవిశ్వాసాలను కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు. హిజాబ్ బ్యాన్‌పై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లాలని పిటిషనర్లకు ఆయన సూచించారు.
కర్ణాటక హైకోర్ట్ మంచి తీర్పిచ్చిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం, విద్యాసంస్థలు నిర్ణయించిన డ్రెస్ కోడ్ పాటించాలన్నారు.
ఇక 2018లోనూ కేరళలో ఇదే ఇష్యూ వచ్చిందన్నారు మరో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్. అప్పట్లో ముస్లిం న్యాయమూర్తే.. విద్యాసంస్థల్లో యూనిఫామ్ మాత్రమే ధరించాలని తీర్పిచ్చినట్టు వెల్లడించారు.
హైకోర్ట్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్నారు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై. ప్రతి ఒక్కరూ హైకోర్ట్ ఆదేశాలు పాటించాలన్నారు..శాంతిని కాపాడాలని..విద్యార్థులందరూ చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఇక కోర్ట్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నమన్నారు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి. ప్రతి ఒక్కరూ హైకోర్ట్ ఆదేశాలను అంగీకరించడం ద్వారా శాంతిని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. విద్యార్థులు అన్ని విషయాలు పక్కనబెట్టి అందరూ కలిసి చక్కగా చదువుకోవాలని సూచించారు.