
కర్నాటక సీనియర్ ఐపీఎస్, డీజీపీ రామచంద్రరావు రాసలీల వ్యవహారంపై సీఎం సిద్దరామయ్య సీరియస్ అయ్యారు. రామచంద్రరావును సస్పెండ్ చేస్తూ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఎంక్వయిరీ ముగిసేవరకు సస్పెన్షన్ కొనసాగుతుందని సర్కార్ స్పష్టం చేసింది. అయితే.. ఇంకా దర్యాప్తు అధికారిని నియమించలేదని.. త్వరలో నియమిస్తామని కర్నాటక హోంమంత్రి పరమేశ్వర్ తెలిపారు..
ధనమాన ప్రాణాలు కాపాడాల్సిన పోలీసాఫీసరై ఉండి కూతురు వయసుస్న అమ్మాయిలతో కులుకుతున్న రామచంద్రరావు డర్టీ పిక్చర్ కెమెరాలకు చిక్కింది. ఒకసారి కాదు పలుమార్లు. ఆ కంటెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. కామఖాకీ అని
విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కానీ రామచంద్రారావు మాత్రం తాను సుద్దపూస అంటున్నారు. ఆ వీడియోలన్నీ అవాస్తవాలంటూ పేర్కొన్నారట.. సాక్షాత్ హోంమంత్రి పరమేశ్వర్ కొలార్‌లో మీడియాకు ఈ ముచ్చట్ల చెప్పారు.
డీజీపీ రామచంద్రారావు వ్యవహారం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందా? అన్న మీడియా ప్రశ్నకు పరమేశ్వర్ స్పందించారు. అందుకే కదా సస్పెండ్ చేశామన్నారు. విచారణకు ఆదేశించాం కానీ..ఇంకా ఎంక్వయిరీ ఆఫీసర్‌ను నియమించలేదన్నారు. విచారణ ముగిసి నివేదిక వచ్చాక చట్టప్రకారం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటామని సెలవిచ్చారు మంత్రి పరమేశ్వర్.
నటి రన్యారావుకు రామచంద్రారావు స్టెఫ్ ఫాదర్. గోల్డ్ స్మగ్లింగ్‌కు ఆమెను ప్రొత్సహించింది అతనేనని రామచంద్రారావుపై ఆరోపణలున్నాయి. ఇప్పుడు రామచంద్రారావు బ్లూ ఫ్లేమ్స్ ఇటు బయట అటు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఒక్కసారి.. రెండుసార్లు కాదు పలుమార్లు అవే తుంటరి చేష్టలతో ఆయన కెమెరాకు చిక్కడం కర్నాటక రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. తన కూతురు వయస్సున్న అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఆయన దొరికిపోవడం సంచలనం రేపుతోంది.
ముద్దులు.. కౌగిలింతలతో రెచ్చిపోయాడు డీజీపీ రామచంద్రారావు. పౌరహక్కులను కాపాడాలని ఆయన్ను సివిల్‌రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్ డీజీపీగా కర్నాటక ప్రభుత్వం నియమిస్తే డర్టీ పిక్చర్‌తో ఇలా కాంట్రావర్సీ ఫ్రేమ్‌లోకి వచ్చారు రామచంద్రరావు..
అయితే ఈ వివాదం నడుస్తుండగా.. రామచంద్రరావు కుమార్తె రాన్యా రావు ఇప్పటికే జైలులో శిక్ష అనుభవిస్తుండటం గమనార్హం. గతేడాది రన్యారావు భారీ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పట్టుబడి బెంగళూరు జైలులో శిక్ష అనుభవిస్తోంది.. ఈ క్రమంలోనే తండ్రి రాసలీలల వ్యవహారం తెరపైకి రావడం కలకలం రేపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..