Karnataka: మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోంది.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

ఇటీవల కర్ణాటకలో జరిగిన పోటాపోటి ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండునెలలకే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Karnataka: మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోంది.. డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు
DK Shivakumar

Updated on: Jul 25, 2023 | 6:42 AM

ఇటీవల కర్ణాటకలో జరిగిన పోటాపోటి ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీని ఓడించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండునెలలకే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు రాష్ట్రం వెలుపల కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇది బీజేపీ వాళ్ల వ్యూహమని.. మా వద్ద నిర్దిష్టమైన సమాచారం ఉందని, ఏం జరుగుతుందో చుద్దామంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌ను కూల్చేందుకు కుట్ర జరుగుతోందని విలేకరులు అడిగిన ప్రశ్నలు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు.

మరోవైపు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలను ఆ రాష్ట్ర రెవెన్యూ మినిస్టర్ కృష్ణ బైరెగౌడ కూడా సమర్థించారు. బీజేపీ వాళ్లు దేశంలో ఎన్నో ప్రభుత్వాలను కూల్చేశారని.. అందుకోసం మనం కూడా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. అసలు వాళ్లకు మంచి, చెడు అనే తేడా లేదని.. వాళ్లు చేసే అప్రజాస్వామిక పోకడలు మనకు తెలిసిందే అని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. దేశంలోని వివిధ ప్రభుత్వాలను కూల్చడంలో వారు ప్రసిద్ధి చెందారంటూ విమర్శలు గుప్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..