ఆసుపత్రి నుంచి కర్నాటక సీఎం ఎడియూరప్ప డిశ్చార్జ్

కరోనా వైరస్ పాజిటివ్ కారణంగా గతవారం బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన కర్నాటక సీఎం బీ.ఎస్.ఎడియూరప్ప సోమవారం హాస్పిటల్ నుంచి..

ఆసుపత్రి నుంచి కర్నాటక సీఎం ఎడియూరప్ప డిశ్చార్జ్

Edited By:

Updated on: Aug 10, 2020 | 7:39 PM

కరోనా వైరస్ పాజిటివ్ కారణంగా గతవారం బెంగుళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన కర్నాటక సీఎం బీ.ఎస్.ఎడియూరప్ప సోమవారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డాక్టర్ల సలహాపై తాను ఆసుపత్రిలో చేరానని, ప్రస్తుతం తన ఆరోగ్యం బాగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. ఏమైనా…. ఆయన ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం సదా పర్యవేక్షిస్తుందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నప్పటికీ ఎడియూరప్ప అధికారిక ఫైళ్లు చూడడం, సమీక్షా సమావేశాలను నిర్వహించడం చేస్తూ వచ్చారట. కాగా- కరోనా పాజిటివ్ తో ఇదే హాస్పిటల్ లో చేరిన ప్రతిపక్షనేత, కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్య ఇంకా కోలుకుంటున్నారు.