మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా నెగెటివ్ ఆర్ టీ-పీసీ ఆర్ సర్టిఫికెట్ ని చూపాలని కర్నాటక ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఇది 72 గంటల్లోగా తీసుకున్నదై ఉండాలని ఈ సర్క్యులర్ లో పేర్కొన్నారు. వారు కనీసం ఒక డోసు టీకామందయినా తీసుకుని ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్ అంటున్నారు. బస్సు ద్వారా గానీ, రైలు లేదా విమానం ద్వారా లేక ప్రైవేటు వాహనంలో వచ్చినా ఈ సర్టిఫికెట్ ఉండి తీరాలన్నారు. మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు వచ్చే విమానాలకు కూడా ఇది వర్తిస్తుందని ఆయన వివరించారు. కోవిద్ వైరస్ అదుపునకు ఈ చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. పక్క రాష్ట్రంలో కోవిద్ ఇంకా బలంగానే ఉందని, ఆ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు ఉన్నాయని ఈ సర్క్యులర్ లో పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు కలిగినవారికి బోర్డింగ్ పాసులు జారీ చేయాలని ఎయిర్ లైన్స్, బస్సు, రైల్వే సర్వీసులను ఆదేశించినట్టు రవికుమార్ తెలిపారు.
మహారాష్ట్రలో నిన్న కొత్తగా 8,085 కేసులు నమోదు కాగా 231 మంది కోవిద్ రోగులు మరణించారు. ఒక్క ముంబై నగరంలోనే తాజాగా 556 కేసులు నమోదయ్యాయి. పూణేలో 281 కేసులు రిజిస్టర్ కాగా.. నాగపూర్, నాసిక్, ఔరంగాబాద్, అమరావతి నగరాల్లో కూడా కేసులు పెరిగినట్టు అధికార వర్గాలు తెలిపాయి. పైగా పలు జిల్లాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. కర్ణాటకలో బెంగుళూరు సహా వివిధ నగరాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నేపథ్యంలో ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించి కన్నడ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మరిన్ని ఇక్కడ చూడండి: Team India: 24 ఏళ్లకే భారత జట్టులోకి వచ్చి.. అనూహ్యంగా నాలుగు నెలలకే వైదొలిగాడు.. అతడెవరంటే!
High alert: ఆంధ్ర – ఒరిస్సా సరిహద్దుల్లో హై అలర్ట్.. నిఘా పెంచిన ప్రత్యేక పోలీస్ బలగాలు