Puneeth Raj Kumar: పుట్టిన ప్రతి జీవి గిట్టక తప్పదు. ఇది అందరికీ తెలుసు.. అయితే కొంతమంది తాము జీవించినప్పుడు చేసిన పనులతో మరణించి చిరంజీవులు. ప్రజల మనస్సులో చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోతారు. ఇందుకు ఉదాహరణగా అనేక మంది మహనీయులు ఉన్నారు. అటువంటి వాటిలో ఒకరుగా ఇటీవల హఠాత్తుగా మరణించిన పునీత్ రాజ్ కుమార్ నిలుస్తారు. పునీత్ మరణించిన అనంతరం అతని మానవత్వం గురించి పదిమందికి తెలిసేవిధంగా అనేక సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పునీత్ జ్ఞాపకార్ధం పునీత్ రాజ్‌కుమార్ పేరుని ఓ గున్న ఏనుగు పిల్లకు అటవీ శాఖ అధికారులు పెట్టారు. వివరాల్లోకి వెళ్తే..
ఇటీవల మరణించిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పేరుని రెండేళ్ల వయసున్న మగ ఏనుగు పిల్లకు శివమొగ్గ సమీపంలోని సక్రెబైలులోని ఏనుగు శిబిరానికి చెందిన అటవీశాఖ అధికారులు పేరు పెట్టారు. ఈ శిబిరాన్ని పునీత్ చివరిసారిగా సెప్టెంబర్‌లో శిబిరాన్ని సందర్శించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఏనుగు సంరక్షణకు సంబంధించిన డాక్యుమెంటరీ షూటింగ్‌లో భాగంగా ఈ గున్న ఏనుగుతో పునీత్ కొంత సమయం గడిపారు.
ఇదే విషయంపై అటవీశాఖ అధికారి నాగరాజ్ మాట్లాడుతూ.. “పునీత్ రాజ్‌కుమార్ సెప్టెంబర్ లో ఈ ఏనుగుల శిబిరాన్ని సందర్శించారు. దాదాపు మూడు గంటలపాటు గడిపారు. ముఖ్యంగా ఈ గున్న ఏనుగుతో పునీత్ ఎంతో సంతోషంగా ఆడుకున్నారు. సాధారణంగా మేము ఏనుగుల పిల్లలకు దేవతల పేర్లతో పేర్లు పెడతాం.. అయితే ఇప్పుడు మా అటవీ సిబ్బంది, స్థానిక ప్రజలు పునీత్ రాజ్‌కుమార్‌కు ఇష్టమైన గున్న ఏనుగుకు పునీత్ రాజ్ కుమార్ పేరు పెట్టమని కోరారు. దీంతో ఇప్పుడు ఈ మగ ఏనుగు పిల్లకు పునీత్ పేరు పెట్టాం.. ఇది మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందని అన్నారు.
#WATCH | Karnataka: The Forest Department has named a two-year-old elephant calf at Sakrebailu elephant camp near Shivamogga after actor Puneeth Rajkumar, who passed away recently. pic.twitter.com/RtHdJ1hRVU
— ANI (@ANI) November 13, 2021
Also Read: