BJP Leader Caught With Girl: అమ్మాయితో అడ్డంగా బుక్కైన బీజేపీ నేత.. రోడ్డుపైనే ఉతికారేశారు!

అయితే, ఈ దాడిలో బిందు భర్త కూడా ఉన్నారు. వృత్తిరీత్యా వ్యాపారి అయిన ఆ వ్యక్తి కూడా తన భార్యను కొట్టాడు. ఇంతలో సమాచారం అందుకున్న జుహీ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు.

BJP Leader Caught With Girl: అమ్మాయితో అడ్డంగా బుక్కైన బీజేపీ నేత.. రోడ్డుపైనే ఉతికారేశారు!
Bjp Leader Mohit Sonkar

Updated on: Aug 22, 2022 | 11:50 AM

BJP Leader Caught With Girl: బీజేపీ నేత ఒకరు గర్ల్‌ఫ్రెండ్‌తో కార్లతో వెళ్తుండగా అతని భార్య, కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఆ తర్వాత నడిరోడ్డుపై నానా రచ్చ చేశారు. తీవ్ర వాగ్వాదం అనంతరం భార్య, అత్తింటివారు కలిసి అతన్ని చితక్కొట్టారు. బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతని భార్యతో పాటు, బీజేపీ నాయకుడిని అత్తమామల కుటుంబ సభ్యులు కొందరు బూట్లతో కొట్టడం కనిపించింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

యూపీలోని బుందేల్‌ఖండ్ ప్రాంత బీజేపీ కార్యదర్శి మోహిత్ సోంకర్ తన స్నేహితురాలు, బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు బిందుతో కలిసి కారులో వెళ్లి పార్టీ చేసుకున్నారు. అయితే సోంకర్‌ భార్య, ఆయన అత్తింటివారు, బిందు భర్త కలిసి వారిద్దరిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బీజేపీ నేత సోంకర్‌ను ఆయన భార్య, అత్తింటి వారు కలిసి రోడ్డుపై చెప్పులతో చితక్కొట్టారు. అయితే, ఈ దాడిలో బిందు భర్త కూడా ఉన్నారు. వృత్తిరీత్యా వ్యాపారి అయిన ఆ వ్యక్తి కూడా తన భార్యను కొట్టాడు. ఇంతలో సమాచారం అందుకున్న జుహీ పోలీస్ స్టేషన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాలను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. బీజేపీ నేత భార్య మోని సోంకర్ పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. మొత్తం ఘటనపై విచారణ జరిపిన తర్వాతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని పోలీసు అధికారి అలోక్ సింగ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు, బీజేపీ నేత సోంకర్‌ను కొడుతున్న ఘటనను ఆయన భార్య తన మొబైల్‌లో రికార్డు చేసింది. పైగా ఈ వీడియో క్లిప్‌ను స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట బాగా వైరల్‌ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి