Ranya Rao: కన్నడ నటి రన్యారావు కేసులో కీలక పరిణామం.. ఏడాది పాటు జైలు శిక్ష!

కన్నడనటి రన్యారావు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్రమంగా బంగారం తరలిస్తూ ఎయిర్‌పోర్టులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కేసులో తాజాగా ఆమెకు ఏడాది పాటు జైలుశిక్ష ఖరారైంది. రన్యారావుకు జైలు శిక్ష విధిస్తున్నట్టు విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్‌ కార్యకలాపాల నివారణ బోర్డు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

Ranya Rao: కన్నడ నటి రన్యారావు కేసులో కీలక పరిణామం.. ఏడాది పాటు జైలు శిక్ష!
Ranya Rao

Updated on: Jul 17, 2025 | 1:49 PM

కన్నడనటి రన్యారావు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్రమంగా బంగారం తరలిస్తు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన కేసులో తాజాగా ఆమెకు ఏడాది పాటు జైలుశిక్ష ఖరారైంది. ఈ కేసుపై గత కొన్ని రోజులుగా దర్యాప్తు చేస్తున్న అధికారులు రన్యారావు, ఆమె సహచరుడు తరుణ్‌తో కలిసి దుబాయ్‌కు చెందిన వజ్రాల కంపెనీని స్థాపించారని, దానిని వారు భారతదేశంలోకి బంగారాన్ని అక్రమంగా రవాణా చేయడానికి ఒక సంస్థగా ఉపయోగించారని తేలింది. రన్యా తన VIP హోదాను దుర్వినియోగం చేసి భద్రతా తనిఖీలను దాటవేసిందని, ఎయిర్‌పోర్టులో తనిఖీల నుంచి తప్పించుకోవడానికి ఆమె పిన తండ్రి, IPS అధికారిని ఉపయోగించుకున్నారని దర్యాప్తులో వెల్లడైంది. దీంతో విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్‌ కార్యకలాపాల నివారణ బోర్డు ఆమెకు ఏడాది పాటు జైలు విక్షను విధించింది. రన్యారావుతో పాటు ఆమె భాగస్వామి తరుణ్, మరో వ్యక్తి సాహిల్‌కు కూడా ఇదే శిక్ష శిక్షను ఖరారు చేసినట్టు బోర్డు తెలిపింది.

ఈ కేసులో ఆమెను దోషిగా నిర్ధారించేందుకు బలమైన సాక్షాలు ఉన్నాయని.. ఈ క్రమంలో శిక్షా కాలంలో నిందితులు బెయిల్‌ కోసం దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కూడా లేకపోవచ్చని స్పష్టం చేసింది. వాళ్లు బెయిల్‌ కోసం ప్రయత్నించినా ఎలాంటి ఫలితాలు ఉండవని తెలిపినట్టు సమాచారం. ఈ కారణంగా జైలు శిక్ష పడిన ముగ్గురు నిందితులు శిక్ష పూర్తయ్యేంత వరకు (ఏదాది) పాటు జైల్లోనే ఉండాల్సి వస్తుందని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ప్రతి మూడు నెలలకు ఒకసారి విచారణలు జరుగుందని బోర్డు తెలిపింది.

ఎయిర్‌పోర్టులో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన రన్యారావు

2024 మార్చి 3వ తేదీన దుబాయ్‌ నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ బెంగళూరు ఎయిర్‌పోర్టులో రన్యారావు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్న డీఆర్ఐ అధికారులు.. ఆమె నుంచి సుమారు. 14.3 కిలోల విలువైన బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన అధికారులు కేసుల్లో చాలా మంది ఇన్వాల్స్‌ అయి ఉన్నట్టు గుర్తించారు. మఖ్యంగా ఆమెకు సహకరించిన తరుణ్, పాహిల్‌ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.