ఇడ్లీలమ్మా.. నీ స్వార్థం లేని సేవ ముందు ఎన్ని కోట్లైనా దిగదుడుపే..!

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా మంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వలస కార్మికుల బాధలు వర్ణనాతీతం.

ఇడ్లీలమ్మా.. నీ స్వార్థం లేని సేవ ముందు ఎన్ని కోట్లైనా దిగదుడుపే..!

Edited By:

Updated on: May 12, 2020 | 3:20 PM

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా మంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వలస కార్మికుల బాధలు వర్ణనాతీతం. ఉండటానికి చోటు లేక తినడానికి తిండి లేక లక్షల మంది వలస కార్మికులు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వారిని ఆదుకునేందుకు పలు ప్రభుత్వాలతో పాటు పలువురు సెలబ్రిటీలు ముందుకొచ్చారు. అయితే వారికి కూడా ఇన్ఫిరేషన్‌గా మారారు తమిళనాడుకు చెందిన కమలాతల్‌ అనే 85ఏళ్ల వృద్ధురాలు.

గత 30 సంవత్సరాలుగా ఇడ్లీని కేవలం రూ.1కే అమ్ముతూ వస్తోన్న కమలాతల్‌.. లాక్‌డౌన్ సమయంలో ఎంతోమందికి అన్నపూర్ణలా మారారు. ఇప్పటికీ ఇడ్లీలను ఆమె ఒక్క రూపాయికే అమ్ముతున్నారు. లాక్‌డౌన్‌ వేళ పలు నష్టాలు వస్తున్నప్పటికీ.. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా ఆమె తన సేవను కొనసాగిస్తున్నారు. ఇక ఆమెకు సంబంధించిన కథను మాజీ ఇండియన్ క్రికెటర్ మహ్మద్ కైఫ్‌ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

”తమిళనాడుకు చెందిన 85 సంవత్సరాల వయసున్న కమలాతల్‌ గత 30 సంవత్సరాలుగా ఒక్క రూపాయికే ఇడ్లీలను అమ్ముతూ వస్తున్నారు. లాక్‌డౌన్‌లో నష్టాలు వస్తున్నాయి కదా అన్న ప్రశ్నకు ఎంతో మంది వలస కార్మికులు ఇక్కడ చిక్కుకున్నారు కదా అని సమాధానం చెప్తున్నారు. ఆమె స్వార్థం లేని సేవ ఓ స్ఫూర్తి దాయకం” అంటూ కైఫ్ కామెంట్ పెట్టారు. ఇక ఈ వీడియోపై నెటిజన్లు సూపర్ అమ్మా.. మీ మంచి మనసుకు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Read This Story Also: అజయ్‌ సినిమా స్టంట్ చేశాడు.. బుక్కయ్యాడు.. వైరల్‌గా మారిన పోలీస్‌ వీడియో..!