Flood Video Watch: 3 గంటల వ్యవధిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం.. వరదల్లో కొట్టుకుపోయిన వందలాది కార్లు, పశు సంపద

Junagadh Flood Video: మూడు గంటల వ్యవధిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇళ్ల లోకి వరద నీరు చేరింది. ఓ గ్యాస్‌ గోడౌన్‌ కంపౌండ్‌ వాల్‌ కూలడంత సిలిండర్లు వరదనీటిలో కొట్టుకుపోయాయి. జునాఘడ్‌లో అయితే ప్రళయం లాగా వర్షాలు విరుచుకుపడ్డాయి.

Flood Video Watch: 3 గంటల వ్యవధిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం.. వరదల్లో కొట్టుకుపోయిన వందలాది కార్లు, పశు సంపద
Flood Video

Updated on: Jul 22, 2023 | 6:54 PM

గుజరాత్‌లో వరదల బీభత్సం కొనసాగుతోంది. నవ్‌సారితో సహా పలు నగరాలు వరదలతో తల్లడిల్లుతున్నాయి. మూడు గంటల వ్యవధిలో 26 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇళ్ల లోకి వరద నీరు చేరింది. ఓ గ్యాస్‌ గోడౌన్‌ కంపౌండ్‌ వాల్‌ కూలడంత సిలిండర్లు వరదనీటిలో కొట్టుకుపోయాయి. జునాఘడ్‌లో అయితే ప్రళయం లాగా వర్షాలు విరుచుకుపడ్డాయి. వరదనీటిలో కార్లు కొట్టుకుపోయాయి. ఎటూ చూసినా వరదనీరే కన్పిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. వందలాది సిలిండర్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. దీంతో సిబ్బంది ప్రేక్షకపాత్ర వహించాల్సి వచ్చింది.

నవ్‌సారిలో ఇళ్ల లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై కూడా మోకాళ్ల లోతు వరకు వరద నీరు చేరడంతో ప్రజలకు ఏం చేయాలో అర్ధం కాలేదు. నవ్‌సారిలో ఎక్కడ చూసినా ట్రాఫిక్‌ జామ్‌లే కన్పిస్తున్నాయి. హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది. రానున్న 24 గంటల్లో గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో అతి భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక కార్లు, బైక్‌లు, క్యాబిన్‌ రాక్‌లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. ప్రజల ఇళ్లలోకి కూడా నీరు చేరింది. పశువులు, వాహనాలు కొట్టుకుపోయాయి. వరదల కారణంగా ఆస్తి, మౌలిక సదుపాయాలకు అపారమైన నష్టం వాటిల్లింది. పశువులు, వాహనాల నష్టం జరిగింది.

జిల్లాలో భారీ వర్షాల తర్వాత జూలై 21, 2023న వరద మొదలైంది. అప్పటి నుండి వర్షాలు కొనసాగుతూనే ఉంది. వరదల కారణంగా అనేక రహదారులు, వంతెనలు కూడా కూలిపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. జునాగఢ్ జిల్లాలో వరద బీభత్సం జనజీవనంపై పెను ప్రభావం చూపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం