బ్రేకింగ్.. భారీ ఉగ్రకుట్ర భగ్నం.. పట్టుబడ్డ ఆయుధాలు చూస్తే షాక్..

గణతంత్ర వేడుకల్లో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు వేసిన ప్లాన్‌ భగ్నం అయ్యింది. దేశంలో పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు భారీగా ఆయుధాలను సమకూర్చుకున్న లష్కర్ ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాద సానుభూతి పరులను అరెస్ట్ చేశారు. బందిపొర పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ చేపట్టిన సంయుక్త దాడుల్లో ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఉగ్రవాదులకు మందుగుండు సామాగ్రితో పాటు.. వారికి కావాల్సిన అవసరాలను […]

బ్రేకింగ్.. భారీ ఉగ్రకుట్ర భగ్నం.. పట్టుబడ్డ ఆయుధాలు చూస్తే షాక్..

Edited By:

Updated on: Jan 25, 2020 | 6:24 PM

గణతంత్ర వేడుకల్లో అలజడి సృష్టించేందుకు ఉగ్రవాదులు వేసిన ప్లాన్‌ భగ్నం అయ్యింది. దేశంలో పెద్ద ఎత్తున దాడులు చేసేందుకు భారీగా ఆయుధాలను సమకూర్చుకున్న లష్కర్ ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు చెందిన ఉగ్రవాద సానుభూతి పరులను అరెస్ట్ చేశారు. బందిపొర పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ చేపట్టిన సంయుక్త దాడుల్లో ఏడుగురు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి పెద్ద ఎత్తున మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఉగ్రవాదులకు మందుగుండు సామాగ్రితో పాటు.. వారికి కావాల్సిన అవసరాలను తీర్చడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. ఉగ్రవాదులకు కావాల్సిన రవాణా వ్యవస్థను కూడా వీరే సమకూర్చేవారని తేలింది. వీరివద్ద నుంచి భారీగా బుల్లెట్లతో పాటుగా.. 10 ఏకే 47 రైఫిల్స్, రెండు 512 ఏకే మిని రైఫిల్స్, ఆరు హ్యాండ్ గ్రేనేడ్లు, రాకెట్ లాంచర్లు, పలు మ్యాగజైన్లను స్వాధీనం చేసుకున్నారు.