జమ్ము కశ్మీర్‌లో మళ్లీ మోగనున్న ఫోన్లు.. ఎప్పటినుంచో తెలుసా?

| Edited By:

Oct 12, 2019 | 2:26 PM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయి దాదాపు రెండు నెలలు దాటింది. ఈ నేపథ్యంలో పోస్ట్ పెయిడ్ మొబైల్ సేవల్ని సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సేవలు శనివారం నుంచి ప్రారంభం కావాల్సిఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో సోమవారానికి వాయిదా వేశారు. 90 శాతం పోస్ట్ పెయిడ్ సర్వీలు అందుబాటులోకి తెస్తున్నట్టు ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రెటరి రోహిత్ కన్సాల్ వెల్లడించారు. అయితే ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించడానికి మాత్రం […]

జమ్ము కశ్మీర్‌లో మళ్లీ మోగనున్న ఫోన్లు.. ఎప్పటినుంచో తెలుసా?
Follow us on

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌లో మొబైల్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయి దాదాపు రెండు నెలలు దాటింది. ఈ నేపథ్యంలో పోస్ట్ పెయిడ్ మొబైల్ సేవల్ని సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సేవలు శనివారం నుంచి ప్రారంభం కావాల్సిఉన్నప్పటికీ సాంకేతిక కారణాలతో సోమవారానికి వాయిదా వేశారు. 90 శాతం పోస్ట్ పెయిడ్ సర్వీలు అందుబాటులోకి తెస్తున్నట్టు ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రెటరి రోహిత్ కన్సాల్ వెల్లడించారు. అయితే ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించడానికి మాత్రం మరికొంత సమయం పట్టే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.

ఆర్టికల్ 370 రద్దుతో మొబైల్ సర్వీసులు, ఇంటర్నెట్ నిషేందించారని దీనివల్ల తమ కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశాన్ని కోల్పోయామంటూ ఎంతోమంది ఆందోళన వ్యక్తం చేశారు. బయటి ప్రపంచంతో తాము సబంధాలు సైతం కోల్పోయినట్టుగా అక్కడున్న వారు సైతం ఆందోళన వక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే దాదాపు 69 రోజుల తర్వాత ఈ నిషేదాఙ్ఞలను కేంద్రం ఎత్తివేసింది.  దీంతో పోస్టు పెయిడ్ మొబైల్ సేవలు అందుబాటులోకి రానుండటంతో కొంతలో కొంత సమాచారం తెలుసే అవకాశం ఉంటుందని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే జమ్ము కశ్మీర్‌లో పర్యటకం కూడా పూర్తిగా  దెబ్బతింది. దీంతో తమకు నష్టం కలుగుతుందని, ఫోన్స్ పనిచేయకపోతే పర్యాటకులు ఎలా వస్తారని కొంతమంది ట్రావెల్ అసోసియేషన్ సంస్ధలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కేంద్రం తాజాగా ఈ సేవల్ని సోమవారం నుంచి తిరిగి ప్రారంభించనుంది.