Crime News: ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ల దాష్టీకం.. నిండు గర్భిణిని దారుణంగా కొట్టి.. ట్రాక్టర్‌తో తొక్కించి..

|

Sep 17, 2022 | 6:36 PM

డబ్బుల పిచ్చి నరనరానా జీర్ణించుకుపోయి మానవత్వమే మరిచిపోతున్న ఓ ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లు.. ఓ నిండు గర్భిణి ప్రాణం తీశారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలోని పరినాథ్ గ్రామంలో చోటుచేసుకుంది.

Crime News: ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్ల దాష్టీకం.. నిండు గర్భిణిని దారుణంగా కొట్టి.. ట్రాక్టర్‌తో తొక్కించి..
Crime News
Follow us on

Pregnant woman crushed under tractor: ఫైనాన్స్ కంపెనీలు, లోన్ రికవరీ ఏజెంట్ల అరాచకాలకు అడ్డు అదుపులేకుండా పోతోంది. లోన్ ఏజెంట్ల వేధింపులు భరించలేక లేక చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. డబ్బుల పిచ్చి నరనరానా జీర్ణించుకుపోయి మానవత్వమే మరిచిపోతున్న ఓ ఫైనాన్స్ కంపెనీ ఏజెంట్లు.. ఓ నిండు గర్భిణి ప్రాణం తీశారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలోని పరినాథ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఓ ఫైనాన్స్ కంపెనీకి చెందిన రికవరీ ఏజెంట్.. ట్రాక్టర్‌తో గర్భిణీని తొక్కించాడు. దీంతో గర్భిణి మృతి చెందింది. ఈ సంఘటన ఇచ్చాక్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితురాలు ఓ దివ్యాంగ రైతు కుమార్తె మూడు నెలల గర్భిణి అని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహీంద్రా ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఎజెంట్లు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ట్రాక్టర్‌ను రికవరీ చేసేందుకు రైతు మిథిలేశ్ మెహతా ఇంటికి వెళ్లారు. ఈ సమయంలో రైతుతోపాటు మూడు నెలల గర్భిణి అయిన అతని కుమార్తె (27) ఉంది. ట్రాక్టర్‌ను తీసుకెళ్తున్న క్రమంలో రైతు, ఫైనాన్స్ కంపెనీ అధికారి.. మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వారు ట్రాక్టర్ తీసుకెళ్లే క్రమంలో కుమార్తె అడ్డుపడటంతో ఆమెను కొట్టారు. అనంతరం ఎదురుపడటంతో ట్రాక్టర్‌తో ఆమెను ఢీకొట్టారు. దీంతో ఆమెకు తీవ్రగాయలై మరణించినట్లు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ మనోజ్ రతన్ చోటే తెలిపారు..

ఈ ఘటన అనంతరం ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్, మేనేజర్ సహా నలుగురిపై హత్య కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మహీంద్రా ఫైనాన్స్ కంపెనీ అధికారులు తమకు సమాచారం ఇవ్వకుండా ఆమె ఇంటికి వచ్చారని బాధితురాలి బంధువు తెలిపారు. ఆమెను కొట్టి ట్రాక్టర్‌తో తొక్కించారని.. అనంతరం ఆసుపత్రికి తీసుకువచ్చారంటూ వెల్లడించారు. కాగా.. ట్రాక్టర్ రికవరీ కోసం బాధితుడి నివాసానికి వెళ్లే ముందు ఫైనాన్స్ కంపెనీ అధికారులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వలేదని హజారీబాగ్ స్థానిక పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనపై మహీంద్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనీష్ షా స్పందించారు. దీనిపై కంపెనీ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తుందని చెప్పారు. థర్డ్ పార్టీ ఏజెన్సీలు లోన్‌రికవరీ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారో తెలుసుకుంటామని.. ఈ కేసు దర్యాప్తు విషయమై పోలీసులకు అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..