Maoists: జార్ఖండ్‌లో మావోయస్టులకు బిగ్ షాక్‌.. భారీ డంప్‌ను గుర్తించిన పోలీసులు..

|

Nov 07, 2022 | 6:03 AM

జార్ఖండ్‌లో మావోయస్టులకు భారీ షాక్‌ తగిలింది. డీప్‌ ఫారెస్ట్‌లో ఉంచిన.. భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బూడాపహాడ్‌ ఫారెస్ట్‌ ఏరియాలో

Maoists: జార్ఖండ్‌లో మావోయస్టులకు బిగ్ షాక్‌.. భారీ డంప్‌ను గుర్తించిన పోలీసులు..
Maoist Dump
Follow us on

జార్ఖండ్‌లో మావోయస్టులకు భారీ షాక్‌ తగిలింది. డీప్‌ ఫారెస్ట్‌లో ఉంచిన.. భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బూడాపహాడ్‌ ఫారెస్ట్‌ ఏరియాలో దాచి ఉంచిన పేలుడు పదార్ధాలు పెద్ద ఎత్తున లభ్యమయ్యాయి. ఫారెస్ట్‌లో ప్రత్యేక కూంబింగ్‌ చేస్తున్న CRPF జవాన్లు.. ఓ స్థావరాన్ని తనిఖీ చేస్తుండగా.. ఈ డంప్‌ బయట పడింది. ఇక్కడి నుంచి డ 90 IED, సిలిండర్‌ బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌ను కూడా ఈ మధ్యనే ఉంచినట్టు తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా జంతాపాయి గ్రామంలో 400 మందికి పైగా మావోయిస్టు సానుభూతిపరులు.. పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారంతా సమితిలోని ధూళిపుట్‌, పాపరమెట్ల పంచాయతీలతోపాటు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఇంజర్‌, జాముగుడ, బైతల్‌ పంచాయతీలకు చెందినవారు. జంతాపాయి గ్రామంలో కొరాపుట్‌ డీఐజీ రాజేష్‌ పండిట్‌, బీఎస్‌ఎఫ్‌ డీఐజీ శైలేంద్రకుమార్‌ సింగ్‌, ఎస్పీ నితీష్‌ వాద్వాని ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మావోయిస్టు సానుభూతిపరులు జనజీవన స్రవంతిలో చేరారు. ప్రభుత్వ అభివృద్ధి పనుల్ని చూసి వారంతా లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..