షాకింగ్ ఘటన.. కరోనా వ్యాక్సిన్ తీసుకోమన్నందుకు.. ఏకంగా పోలీసు అధికారి చేయి విరగ్గొట్టాడు..

|

Dec 27, 2021 | 11:44 AM

Covid-19 Vaccine: దేశంలో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కరోనా కొత్తవేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. అయితే.. కరోనా నియంత్రణకు

షాకింగ్ ఘటన.. కరోనా వ్యాక్సిన్ తీసుకోమన్నందుకు.. ఏకంగా పోలీసు అధికారి చేయి విరగ్గొట్టాడు..
Man Breaks Police Officer's
Follow us on

Covid-19 Vaccine: దేశంలో కరోనావైరస్ కేసులు, మరణాల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కరోనా కొత్తవేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. అయితే.. కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ఒక్కటే ఆయుధమని.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం పదేపదే సూచనలు చేస్తోంది. దీంతోపాటు వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను కూడా ముమ్మరంగా నిర్వహిస్తోంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్‌పై ఎన్నో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాయి. అయినా చాలామందిలో అపోహలు మాత్రం వీడటం లేదు. ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోమంటూ మొండిపట్టుపడుతున్నారు. దీనికి సంబంధించిన సంఘటన తాజాగా.. ఒకటి వెలుగులోకి వచ్చింది. వ్యాక్సిన్ తీసుకోమన్నందుకు.. ఓ వ్యక్తి ఏకంగా పోలీసు అధికారి చేయి విరగ్గొట్టాడు. టీకా తీసుకోవడానికి నిరాకరించిన ఆ వ్యక్తికి పోలీసు అధికారి ఒప్పించడానికి ప్రయత్నించగా.. అతనితో గొడవపడి చెయ్యి విరగ్గొట్టాడు. ఈ షాకింగ్ ఘటన ఝార్ఖండ్‌లోని గిరిధ్‌ జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది.

గిరిధ్ జిల్లాలోని బెంగాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మహువర్‌ గ్రామంలో.. ప్రజలంతా టీకాలు తీసుకోవాలంటూ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పోలీస్‌ అధికారి కృష్ణ కుమార్‌ మరాండి కూడా హాజరయ్యారు. ఈ సమయంలో టీకాలు వేస్తుండగా.. రామచంద్ర ఠాకుర్‌ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు టీకా తీసుకోమంటూ తేల్చి చెప్పారు. ఈ సమయంలో.. ఆ కుటుంబసభ్యులకు వ్యాక్సిన్‌ ప్రయోజనాల గురించి చెప్పి ఒప్పించడానికి పోలీస్ అధికారి కృష్ణ కుమార్‌ ప్రయత్నించారు. ఇదంతా వినకుండా ఆయనపై ఆగ్రహానికి గురైన ఠాకుర్‌ కర్రతో ఒక్కసారిగా దాడి చేయగా.. పోలీస్ అధికారి చెయ్యి విరిగింది.

ఈ ఘటన అనంతరం ఠాకుర్‌ అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం కృష్ణ కుమార్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి.. అతని కోసం గాలిస్తున్నట్లు స్టేషన్ ఆఫీసర్ కమలేశ్ పాశ్వాన్ తెలిపారు.

Also Read:

Viral Video: నాతోనే గేమ్సా.. వేటాడేందుకు వచ్చిన పులితో దాగుడుమూతలు ఆడిన బాతు..! వీడియో వైరల్

AFSPA in Nagaland: ఈశాన్యంలో చిచ్చు రేపుతున్న సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం.. దిద్దుబాటు చర్యల్లో కేంద్రం!