Jharkhand: జార్ఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. డియోఘర్ జిల్లా(Deoghar District) త్రికూట్ కొండ(Trikut Hills) ల్లోని రోప్‌వేలో రెండు క్యాబిన్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వైర్లు తెగిపోయాయి. దీంతో రోప్‌వేపై ఉన్న రెండు ట్రాలీలు కిందపడిపోయాయి. ఘటనలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు. మరో 48 మంది పర్యాటకులు త్రికూట్ కొండల్లో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ త్రికూట్ కొండల్లో కొలువై ఉంటారని భక్తుల విశ్వాసం. వాటిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు.
జార్ఖండ్ నుంచే కాకుండా బెంగాల్, ఒడిశా, బిహార్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. అయితే ఆ కొండలపైకి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో రోప్‌వేను ఉపయోగిస్తారు.
నిన్న శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా త్రికూట్ పర్వతానికి భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో రోప్‌వే వైరు తెగిపోవడంతో మరో దారి లేక త్రికూట్ కొండల్లోనే చిక్కుకుపోయారు. వెంటనే సమచారమందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఎయిర్‌ఫోర్స్ కూడా రంగంలోకి దిగి ఆర్మీ హెలికాఫ్టర్ల ద్వారా వారిని రక్షించేందుకు చర్యలు చేపట్టాయి.
Also Read: Minister RK Roja: ప్రమాణస్వీకారం వేళ రోజా ఎమోషనల్.. జగన్‌కు పాదాభివందనాలు..
Viral Video: ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి.. తాబేలు ఆకలి తీరుస్తున్న కోతి.. వీడియో వైరల్..