
తాజాగా జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ భారీ విషయాన్ని సాధించిన విషయం తెలిసిందే. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం పార్టీకి కొత్త ఊపు తెచ్చింది. రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీకి బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది.
ఇక మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి ప్రధాని చరిష్మానే కారణమని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. దేశంలో ఏమాత్రం తగ్గని మోదీ గారి క్రేజ్‌కు నిదర్శనమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో జనతాదళ్ యునైటెడ్‌కు చెందిన ఎంపీ సునీల్ కుమార్ పింటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. సునీల్ కుమార్ మోదీని ప్రశంసిస్తూ చేసిన స్లోగన్ వివాదస్పదంగా మారింది.
ఎన్నికల ఫలితాల విడుదలైన వెంటనే ‘గెలుపు మోదీతో సాధ్యమవుతుంది’ అనే స్లోగన్‌ను.. జనతాదళ్ నేత సునీల్ కుమార్ పింటూ సైతం ప్రశంసించారు. దీంతో జేడీయూ పార్టీ నేతలుపింటూపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీకి, బీజేపీకి మద్ధతుగా వ్యవహరించడంతో పింటూపై సొంతం పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సునీల్ కుమార్ వెంటనే లోక్ సభ సత్వానికి రాజీనామా చేయాలని జేడియూ పార్టీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ డిమాండ్ చేశారు. పింటూ మోదీ పట్ల ప్రభావితం అయ్యారని ఆగ్రహించారు.
పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులు ఉండగా.. ఇలా బీజేపీకి, మోదీకి అనుకూలంగా నినాదాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా విషయంలో నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఇక మోదీకి అనుకూలంగా చేసిన స్లోగన్స్‌పై బీజేపీ అధికార పార్టీ ప్రతినిధి కుంతల్ కృష్ణ స్పందించారు.. పింటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయని చెప్పుకొచ్చారు.
ఇదిలా జేడీయూ పార్టీ బీజేపీతో తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. జేడీయూ గతేడాది ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న నితీష్ కుమార్, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అయితే ఆ తర్వాత ఆర్‌జేడీ, కాంగ్రెస్‌తో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విధితమే.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..